కాప్సికం బజ్జి | Capsicum bajji Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  24th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Capsicum bajji recipe in Telugu,కాప్సికం బజ్జి, Sree Vaishnavi
కాప్సికం బజ్జిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    9

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

కాప్సికం బజ్జి వంటకం

కాప్సికం బజ్జి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Capsicum bajji Recipe in Telugu )

  • కాప్సికం 2.
  • వాము. 1 టీస్పూన్
  • జీలకర్ర. 1 టీస్పూన్
  • శనగపిండి. 150 గ్రా
  • ఉప్పు. తగినంత
  • నూనె. సరిపడా
  • మరమరాలు 3 కప్పులు
  • కారం 1 చెంచా
  • టమాట 1 తరిగినది
  • కీరా 1/2 తరిగినది
  • ఉల్లిపాయ 1 తరిగినది
  • నిమ్మకాయరసం 1/2 చెంచా
  • ఎండుమామిడి పొడి 1/2 చెంచా
  • కొత్తిమీర తరిగినది 1 చెంచా
  • పచ్చిమిర్చి తరిగినది 1
  • సన్నటి కారపూస 3 చెంచాలు
  • పుదీన తరిగినది 1/2 చెంచా
  • చాట్ మసాలా 1/2 చెంచా
  • గరం మసాలా 1/2 చెంచా

కాప్సికం బజ్జి | How to make Capsicum bajji Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో శనగపిండి, వాము, జీలకర్ర, ఉప్పు, నీరు వేసి పకోడీల పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి.
  2. తరువాత కాప్సికం కడిగి ముందుగా కలిపి ఉంచిన పిండి మిశ్రమములో కాయలను ముంచి
  3. మూకుడు లో నూనె వేసి కాగిన తరువాత పిండిలో ముంచిన కాప్సికంను వేసి బజ్జీల్లాగా దోరగా వేయించి తీసేయాలి.
  4. ఇప్పుడు ఉల్లిపాయ,టమాట,కీరాని కడుగుక్కొని చిన్నముక్కలుగా తరుగుకోవాలి
  5. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి
  6. అందులో తరిగిన ఉల్లిపాయ,టమాట,కీరా, పచ్చిమిర్చి వేసుకోవాలి
  7. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు,కారం,గరం మసాలా,చాట్ మసాలా,సేవ్,నిమ్మకాయ కొత్తిమీర,పుదీన, ఆంచూర్ వేసి బాగా కలుపుకోవాలి
  8. ఇప్పుడు అందులో మరమరాలు వేసి కలుపుకోవాలి.
  9. మనం ముందుగా తయారుచేసుకున్న కాప్సికం బజ్జిని మద్యలోకి కోసుకొని
  10. మరమరాల మిస్రమాన్ని కూరుకోవాలి. ఇలా కూరుకున్న బజ్జీలను పళ్ళెంలో వడ్డించుకుని తినటమె.
  11. టీ టైం లో తినటానికి చాలా బాగుంటుంది.

Reviews for Capsicum bajji Recipe in Telugu (0)