హోమ్ / వంటకాలు / బంగాళదుంప టోఫిస్

Photo of Potato toffies by Ram Ram at BetterButter
419
3
0.0(0)
0

బంగాళదుంప టోఫిస్

May-24-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళదుంప టోఫిస్ రెసిపీ గురించి

వీటిని వేడి వేడిగా తింటే కరకరలాడుతూ ఉంది బాగుంటాయి.. టమాటో సాస్ తో తింటే ఇంకా రుచిగా ఉంటాయి...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కిట్టి పార్టీలు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 1కప్పు
  2. వాము 1 స్పూన్
  3. ఉప్పు సరిపడా
  4. బంగాళదుంప పెద్దది ఒకటి
  5. పచ్చిమిర్చి 2
  6. జీలకర్ర 1/2స్పూన్
  7. ఆవాలు1/4స్పూన్
  8. కరివేపాకు కొద్దిగా
  9. కొత్తిమీర కొద్దిగా
  10. నిమ్మకాయ 1 చిన్నది
  11. పసుపు చిటికెడు
  12. కారం 1స్పూన్
  13. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందు 1కప్పు మైదా లో 1 స్పూన్ వాము, ఉప్పు, 2స్పూన్ల నూనె వేసి అంత కలిసేలా కలుపుకోవాలి..
  2. తర్వాత ఆ పిండిలో సరిపడా నీళ్లు వేసి పూరి పిండి ల కలుపుకోవాలి
  3. తర్వాత తడి బట్ట కప్పి 15నిమిషాలు పక్కన పెట్టుకోవాలి...
  4. బంగాళదుంప ని ఉడకపెట్టి చిదుముకోవాలి
  5. తర్వాత పాన్ పెట్టి 2స్పూన్ల నూనె వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించుకుని దానిలో చిటికెడు పసుపు సరిపడా కఉప్పు, 1స్పూన్ కారం వేసి చిదిమిన బంగాళదుంప మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.. చివరిలో కొత్తిమీర వేసి..చల్లారిన తర్వాత నిమ్మరసం వేసి కలపాలి..
  6. తర్వాత పిండిని చిన్న పురిలా వత్తుకుని ఘాట్లు పెట్టాలి
  7. దీని మధ్యలో బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టి చుట్టుకోవాలి
  8. ఇలా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి
  9. పాన్ పెట్టి డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర