సగ్గుబియ్యం బుల్లెట్స్ | Sabudana bullets Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  25th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sabudana bullets recipe in Telugu,సగ్గుబియ్యం బుల్లెట్స్, Sree Vaishnavi
సగ్గుబియ్యం బుల్లెట్స్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    1 /4గంటలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

సగ్గుబియ్యం బుల్లెట్స్ వంటకం

సగ్గుబియ్యం బుల్లెట్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sabudana bullets Recipe in Telugu )

  • నానబెట్టిన సగ్గుబియ్యం 1 1/2 కప్
  • ఉడికించిన బంగాళదుంప 2
  • పచ్చిమిర్చి 2-3
  • జీలకర్ర 1/2 చెంచా
  • ఉల్లిపాయ 2
  • మైదా పిండి 4-6 చెంచాలు
  • కార్న్ ఫ్లోర్ 3-4 చెంచాలు
  • ఉప్పు తగినంత
  • కారం 1 చెంచా
  • గరం మసాలా 1 చెంచా
  • కొత్తిమీర 2 చెంచాలు
  • చాట్ మసాలా 1/2 చెంచా
  • నూనె వేయించటానికి సరిపడ

సగ్గుబియ్యం బుల్లెట్స్ | How to make Sabudana bullets Recipe in Telugu

  1. ముందుగా సగ్గుబియ్యం ని నీటిలో నానబెట్టుకోవాలి
  2. అది నానిన తరువాత అందులో తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి
  3. అందులో కొత్తిమీర ఉల్లిపాయ తరిగినవి వేసుకోవాలి
  4. ఇప్పుడు అందులో ఉడికిన ఆలూ వేసుకోవాలి
  5. వాటి అన్నిటిని బాగా కలుపుకోవాలి
  6. ఇప్పుడు అందులో ఉప్పు వేసుకోవాలి
  7. అందులో కారము కూడా వేసుకోవాలి
  8. అందులో కార్న్ ఫ్లోర్,మైదా, వేసుకుని బాగా కలుపుకోవాలి
  9. కొంచెం గరం మసాలా వేసుకోవాలి
  10. ఇప్పుడు పిండి ని బాగా కలుపుకొని బుల్లెట్స్ ల చేసుకోవాలి
  11. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టుకొని కాచుకొని ఈ బుల్లెట్స్ ని వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి
  12. అంతే వేడి వేడి సగ్గుబియ్యం బుల్లెట్స్ తయారు

Reviews for Sabudana bullets Recipe in Telugu (0)