పప్పు చెక్కలు | Pappu chekkalu Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  25th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Pappu chekkalu recipe in Telugu,పప్పు చెక్కలు, Sree Vaishnavi
పప్పు చెక్కలుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    3

    1 /4గంటలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

పప్పు చెక్కలు వంటకం

పప్పు చెక్కలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pappu chekkalu Recipe in Telugu )

  • బియ్యంపిండి 2 కప్పులు
  • నానబెట్టిన సెనగపప్పు 1/2 కప్
  • తెల్ల నువ్వులు 1/2 కప్
  • వేయించిన పల్లీలు 1/2 కప్
  • జీలకర్ర పచ్చిమిర్చి కారం 2 చెంచాలు
  • ఉప్పు తగినంత
  • నీళ్లు సరిపడినంత
  • నూనె వేయించడాని సరిపడ

పప్పు చెక్కలు | How to make Pappu chekkalu Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె లో బియ్యంపిండి వేసుకోవాలి
  2. అందులో నానబెట్టిన పల్లీలు, సెనగపప్పు నువ్వులు, వేసుకోవాలి
  3. అందులో ఉప్పు, జీలకర్ర ,పచ్చిమిర్చి కారం, వేసి బాగా కలుపుకోవాలి
  4. అందులో నీళ్లు పోసి చపాతీ పిండి ల కలుపుకోవాలి
  5. ఒక బాండి లో నూనె వేసుకొని వేడిచేసుకోవాలి .
  6. ఒకే పాలిథిన్ కవర్ తీసుకొని దానిమీద కొంచెం నూనె రాసుకొని.
  7. ఇప్పుడు పిండిని గుండ్రని ఉండాలా చేసుకొని
  8. చేతితో తట్టి పల్చగా చేసుకొని
  9. వెంటనే వేడిగా అయ్యిన నూనె లో వేసి వేయించుకోవాలి
  10. అలా వరుసగా చేసుకొని నూనెలో వేసుకొని వేయించుకొని తీసుకోవాలి.
  11. వేగినవన్నీ పళ్లెం లో తీసుకొని వడ్ఢిమ్చుకోవాలి . అంతే పప్పుచెక్కలు రెడీ .

నా చిట్కా:

పిండి ని గట్టి గా కలుపుకొని పూరీ ప్రెస్ లో ఒత్తుకుని వేయించుకోవచ్చు .

Reviews for Pappu chekkalu Recipe in Telugu (0)