వెజిటబుల్ చీజ్ బాల్స్ | Vegetable Cheese Balls Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  25th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Vegetable Cheese Balls recipe in Telugu,వెజిటబుల్ చీజ్ బాల్స్, Tejaswi Yalamanchi
వెజిటబుల్ చీజ్ బాల్స్by Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

వెజిటబుల్ చీజ్ బాల్స్ వంటకం

వెజిటబుల్ చీజ్ బాల్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vegetable Cheese Balls Recipe in Telugu )

  • బంగాళాదుంపలు 2
  • పచ్చిమిర్చి 2
  • కారం ఒక చెంచా
  • ఉప్పు రుచికి సరిపడా
  • మైదా 2 చెంచాలు
  • మొక్కజొన్న పిండి 3 చెంచాలు
  • క్యారట్ 1
  • చీజ్ పేకెట్ 1
  • ధనియాల పొడి సగం చెంచా
  • అల్లంవెల్లులి పేస్ట్ 1 చెంచా
  • గరం మసాలా సగం చెంచా
  • బ్రెడ్డుక్రయంప్స్ కొదిగా

వెజిటబుల్ చీజ్ బాల్స్ | How to make Vegetable Cheese Balls Recipe in Telugu

  1. బంగాళదుంప క్యారెట్ పచ్చిమిర్చి తీసుకోండి
  2. గరంమసాల పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లిపేస్ట్ తీసుకోండి
  3. ఉప్పు కారం తీసుకోండి
  4. క్యారెట్ పచ్చిమిర్చిలను ముక్కలుగా కోసుకోండి
  5. బంగాళదుంపలను కుక్కర్లో వేసి నీళ్ళు పోసుకొని పోయి మీద పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి
  6. మూడు చీజ్ స్లైస్లను తీసుకోండి
  7. ఒకదాని మీద ఒకటి పెట్టండి
  8. ఇలా ముక్కలుగా చేసుకోండి
  9. బంగాళాదుంపలు ఉడికాక పైన తొక్క తీసి గిన్నె లో వేసుకోండి
  10. మెత్తగా ఇలా చేస్కోండి
  11. మెత్తగా చేసుకున్న దుంపలో క్యారెట్ పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు కారం అల్లంవెల్లుల్లి పేస్ట్ ధనియాలపొడి గరంమసాలా వేసుకోండి
  12. మొక్కజొన్న పిండి మైదా వేసుకోండి
  13. మొత్తం కలిపి మిశ్రమాన్ని ఇలా చేసుకోండి
  14. వాటిని ఉండలుగా చేసుకోండి
  15. ఉండలను మెత్తగా ఒత్తి వాటి మధ్యలో చీజ్ పెట్టండి
  16. మళ్లీ వాటిని ఉండల్లా చేసుకోండి
  17. ఒక బౌల్ తీసుకొని కాస్త నీరు పోసుకొని, ఒక చెంచా మొక్కజొన్న పిండి వేసుకుని ఇలా కలుపుకొండి
  18. ఇలా చేసుకోండి
  19. బ్రెడ్డుక్రయంప్స్ తీసుకోండి
  20. ఉండాలని మొక్కజొన్న పిండి మిశ్రమంలో ముంచి బ్రెడ్డుక్రయంప్స్ లో దొలించండి
  21. ఇలా చేసుకొని పెట్టుకోండి
  22. పోయి పైన డీప్ ఫ్రై కి బండి పెట్టుకొని నునె వేసుకొని వేడి చేయండి
  23. నూనె కాగాక ఉండలు వేసుకొని వేయించండి.బంగారు రంగు వొచ్చేదాక వేయించండి
  24. వేగాక విడిగా తీసుకొని పళ్లెం లో పెట్టుకోండి
  25. బంగాళదుంప క్యారెట్ చీజ్ బాల్స్ తయారు

Reviews for Vegetable Cheese Balls Recipe in Telugu (0)