పాలకాయలు | Rice flour savory Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  25th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Rice flour savory recipe in Telugu,పాలకాయలు, Sree Vaishnavi
పాలకాయలుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    8

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

పాలకాయలు వంటకం

పాలకాయలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rice flour savory Recipe in Telugu )

  • బియ్యం పిండి 1 కప్పు
  • వెన్న 2 చెంచా
  • ఉప్పు 1 చెంచా
  • కారం 1 చెంచా
  • నువ్వుపప్పు 3 చెంచాలు
  • వాము 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా

పాలకాయలు | How to make Rice flour savory Recipe in Telugu

  1. ఎంత బియ్యం పిండి పాలకాయలు చేద్దామనుకుంటే, సమాన పరిమణంలో నీరు పొయ్యి మీద ఎసరు పెట్టాలి.
  2. మరుగుతున్న నీటిలో తగినంత ఉప్పు, కారం, నువ్వుపప్పు, వాము, జీలకర్ర, ఇంగువ ఇలా మనకు కావలసినవి వేసుకోవాలి
  3. బియ్యం పిండిలో వెన్నముద్ద వేసి, ఉండలు కట్టకుండా బాగా కలపాలి.
  4. మరుగుతున్న నీటిలో ఈ వెన్న కలిపిన బియ్యం పిండిని పోసి ఉండాలు కట్టకుండా కలపాలి. అడుగంటకుండా గిన్నెను దించి అలా వుంచెయ్యాలి.
  5. అలా ఉడికిన పిండి అయిదారు గంటలు నానాలి.
  6. తరువాత చేతికి నూనె రాసుకుంటూ, ఈ మొత్తం పిండిముద్దని కుంకుడు కాయంత ఉండలు చేసుకోవాలి.
  7. ఈ గోళీలను ఒక బట్టమీద వేస్తూ ఆరనివ్వాలి.
  8. పొయ్యిమీద బూరెల మూకుడు పెట్టి వనస్పతి గాని, నూనె గాని పోసి ఒక్కొకసారి చారెడు గోళీలు చొప్పున పోసి వేగనివ్వాలి.
  9. గోధుమరంగు వచ్చేవరకు వేగనిచ్చి తీసేస్తుండాలి
  10. వేగిన పాలకాయలను వేడి చల్లారిన తరువాత సీసాలోనో లేదా డబ్బాలోనో పోసి ఉంచుకోవాలి.

నా చిట్కా:

పాలకాయలకు కొట్టుడు పిండి వాడకూడదు. విసురుడు పిండి కావాలి. కొట్టుడు పిండైతే మరిగే నూనెలో వేసేసరికి టప్పున పేలిపోతాయి.

Reviews for Rice flour savory Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo