హోమ్ / వంటకాలు / అటుకుల వెల్లులి కారం

Photo of Spicy garlic poha by Sree Sadhu at BetterButter
525
3
0.0(0)
0

అటుకుల వెల్లులి కారం

May-26-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల వెల్లులి కారం రెసిపీ గురించి

సులువైన కిట్టి పార్టీ లో సర్వ్ చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. అటుకులు 2 కప్పులు
  2. ఎండుమిరపకాయలు 4-5
  3. పుట్నాల పప్పు 1/2 కప్
  4. పల్లీలు 1/2 కప్
  5. కరివేపాకు 2 రెమ్మలు
  6. వెల్లులిపాయలు 5-6
  7. జీలకర్ర 2 చెంచాలు
  8. ఉప్పు తగినంత
  9. ఎర్ర కారం 2 చెంచాలు
  10. నూనె వేయించడానికి సరిపడ
  11. పంచదార పొడి 1-2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఒక కడాయి లో నూనె పోసి కాచుకోవాలి
  2. నూనె కాగాక అందులో ఒక జాలి గరిట లో అటుకులు వేసి వేయించాలి
  3. అవి వేగిన తరువాత నూనె పీల్చే బట్ట మీద వేసుకోవాలి
  4. ఇప్పుడు పల్లీలు కూడా నూనె లో వేయించుకోవాలి
  5. అవి వేగిన తరువాత పుట్నాలు కూడా వేయించాలి
  6. తరువాత పొయ్యి ఆపేసి కరివేపాకు వేసుకొని వేయించాలి
  7. వేగిన వాటిని అన్నిటిని ఒక గిన్నె లో వేసుకొని కలుపుకోవాలి
  8. ఇప్పుడు ఒక రుబ్బు రోలు తీసుకొని అందులో వెల్లులిపాయలు, ఉప్పు, జీలకర్ర ,కారం, వేసి పొడిగా దంచుకోవాలి
  9. ఆ పొడి ని వేయించిన మిశ్రమం లో వేసుకోవాలి
  10. ఇప్పుడు ఎండుమిరపకాయలు ని వేయించి అందులో వేసుకోవాలి
  11. అంత బాగా కలిపాక పంచదార పొడి వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర