హోమ్ / వంటకాలు / వెజ్ మంచురియా

Photo of Veg Manchurian by Sree Sadhu at BetterButter
620
2
0.0(0)
0

వెజ్ మంచురియా

May-26-2018
Sree Sadhu
25 నిమిషాలు
వండినది?
24 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ మంచురియా రెసిపీ గురించి

ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు వెజ్ స్టార్టర్ ఆర్డర్ చేయాల్సి వస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫస్ట్ ప్రిఫర్ చేసే స్టార్టర్ వెజ్ మంచూరియన్.ఎంత తిన్నా నాన్ స్టాప్ గా అలా నోట్లోకి వెళ్లిపోతూనే ఉంటుంది.కారం కారంగా వేడిగా ఎంతో టేస్టీ గా ఉంటుంది.హోటల్ లో అయితే టక్కున ఆర్డర్ చేసేస్తాం అదే ఇంట్లో చేయాలంటే కాస్త పని ఎక్కువే.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • చైనీస్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. 1 క్యాబేజీ బాగా సన్నగా తురిమినది
  2. 1 క్యారెట్
  3. 1/3 కప్పు పచ్చి బఠానీ కచ్చాపచ్చా గా రుబ్బినది
  4. ¼ కప్పు ఫ్రెంచ్ బీన్స్ సన్నగా తరిగినది
  5. ¼ కప్పు క్యాప్సికం సన్నగా తరిగినది
  6. ఉప్పు తగినంత
  7. 3 - 4 చెంచాలు కార్న్ ఫ్లోర్
  8. 3 - 4 చెంచాలు మైదా పిండి
  9. 1 చెంచా అల్లం తరుగు
  10. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  11. మంచూరియా కొరకు 1 చెంచా అల్లం తరుగు
  12. 1 చెంచా వెల్లుల్లి తరుగు
  13. కొద్దిగా ఉప్పు
  14. 2 - 3 చెంచాలు నూనె
  15. 1 చెంచా కార్న్ ఫ్లోర్
  16. 1 చెంచా కారం
  17. 1 కప్పు నీళ్ళు
  18. 1/3 కప్పు ఉల్లి కాడ మొదలు తరుగు
  19. 1 చెంచా వెనిగర్
  20. 2 చెంచాలు చిల్లీ సాస్
  21. 1 చెంచా ర్క్ సోయా సాస్
  22. 1 చెంచా మిరియాల పొడి
  23. 2 చెంచాలు ఉల్లి కాడ తరుగు

సూచనలు

  1. ఒక మిక్సింగ్ బౌల్ లో సన్నగా తరిగిన అన్ని కూరగాయలు, ఉప్పు, కార్న్ ఫ్లోర్, మైదా పిండ, అల్లం తరుగు వేసి బాగా కలపాలి.
  2. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి
  3. ఒక కడాయిలో నూనె వేడి చేసి అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెజ్ బాల్స్ ను వేసి చక్కని నారింజ ఎరుపు రంగు వచ్చే వరకు వేయించి పేపర్ నాప్‌కిన్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
  4. 1 చెంచా కార్న్ ఫ్లోర్ లో పావు లీటరు నీళ్లు పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  5. ఒక పాన్ లో నూనె వేసి కాగాక అందులో అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, ఉల్లి కాడ మొదలు తరుగు, క్యాప్సికం తరుగు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
  6. తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, మిరియాల పొడి, వెనిగర్, డార్క్ సోయా సాస్ వేసి కలపాలి.
  7. కార్న్ స్టార్చ్ కూడా వేసి బుడగలు వచ్చే వరకు ఉడికించాలి.
  8. అందులో వేయించి పెట్టుకున్న వెజ్ బాల్స్ వేసి 3 నుండి 5 నిమిషాల పాటు లేదా మంచూరియన్ గ్రేవీ డ్రై అయ్యే వరకు వేయించాలి.
  9. ఉల్లి కాడల తరుగు పైన చల్లి స్టవ్ కట్టేసి వేడిగా సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర