Home / Recipes / Watermelon-Tomato Curry

Photo of Watermelon-Tomato Curry by Abhinetri V at BetterButter
508
2
0.0(0)
0

Watermelon-Tomato Curry

May-06-2018
Abhinetri V
10 minutes
Prep Time
10 minutes
Cook Time
4 People
Serves
Read Instructions Save For Later

ABOUT Watermelon-Tomato Curry RECIPE

పుచ్చకాయ ఎండాకాలంలో ఎక్కువగా ఉపయోగించే పండు. కానీ ఈ పండు లోని తెలుపు భాగం(రిండ్) కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ తెలుపు భాగం తో రుచికరమైన కూర ని తయ్యార్ చేదాం.

Recipe Tags

  • Veg
  • Easy
  • Andhra Pradesh
  • Simmering
  • Side Dishes
  • Healthy

Ingredients Serving: 4

  1. పుచ్చకాయ ( తెలుపు భాగం/రిండ్) - 1 కప్పు
  2. టమాటా ( ముక్కలు ) - 1 కప్పు
  3. ఆవాలు-1/4 టీస్పూన్
  4. జీలకర్ర-1/4 టీస్పూన్
  5. నూనె- 2 టేబుల్ స్పూన్స్
  6. ఉల్లిపాయ(సన్నగా తరిగిన)- 1/2 కప్పు
  7. అల్లం-వెల్లులి పేస్ట్/ముద్ద - 1 టేబుల్ స్పూన్
  8. పసుపు - చిటికెడు
  9. ఉప్పు- తగినంత
  10. పచ్చి మిర్చి- 3
  11. కారం-1 టీస్పూన్

Instructions

  1. పుచ్చకాయ ని శుభ్రంగా కడిగి, పైన ఉన్న స్కిన్/తొక్క ను తీసి , తెలుపు భాగాన్ని మాత్రం పక్కన పెట్టండి.
  2. ఇప్పుడు జాగ్రత్తగా ఆ తెలుపు భాగాన్ని ముక్కలు గా కొయ్యండి.
  3. ఒక బాణాన్ని లో నూనె వేసి, ఆవాలు మరియు జీలకర్ర ని వేగించండి.
  4. పోపు వేగాక, ఉల్లి ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు అందులో వెయ్యండి. ఉల్లి ముక్కలు కాస్త వేగాక,ఇందులో ముందుగా కోసిపెట్టిన పుచ్చకాయ లో తెలుపు ముక్కలు(రిండ్) వేసి రెండు నిమిషాలు వేగనివ్వండి.
  5. వేగినముక్కలో టమాటా ముక్కలు చిటికెడు పసుపు,రుచికి సరిపడ ఉప్పు, అల్లం-వెల్లులి పేస్ట్ వేసి శుభ్రంగా కలపండి. ఈ మిశ్రమాన్ని సన్నని సెగపైన 5 నిమిషాలు ఉడకనివ్వాలి.
  6. టమాటా ముక్కలు మెత్తపడ్డాక , కారం వేసి అన్నివైపులా కలపండి. ఇందులో ఇగురికి సరిపడ నీరు పోసి మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి.
  7. ఈ కూర ని అన్నం లో లేదా చపాతీ/రోటీ తో వడించండి.

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review
A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE