హోమ్ / వంటకాలు / గ్రిల్డ్ టోఫు కబాబ్

Photo of Grilled Tofu Kebabs by Abhinetri V at BetterButter
788
2
0.0(0)
0

గ్రిల్డ్ టోఫు కబాబ్

May-27-2018
Abhinetri V
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గ్రిల్డ్ టోఫు కబాబ్ రెసిపీ గురించి

టోఫు కబాబ్స్ రుచిలో అద్భుతంగా ఉంటాయి. గ్రిల్డ్ టోఫు కబాబ్స్ ఆరోగ్యానికి కూడా మంచివి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • గ్రిల్లింగ్
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బంగాళదుంప(ఉడికించిన)- 1
  2. క్యారెట్ (ఉడికించిన) - 1
  3. టోఫు (తురిమిన)- 1 కప్పు
  4. సెనగపప్పు (నానబెట్టిన) - 2 టేబుల్ స్పూన్స్
  5. అటుకుల పొడి/పౌడర్ - 2 టేబుల్ స్పూన్స్
  6. కారంపొడి- 2 టీస్పూన్స్
  7. ఉప్పు- తగినంత
  8. నూనె- 2 టీస్పూన్స్
  9. అల్లం- 1/4 టీస్పూన్
  10. కరివేపాకు(సన్నగా తరిగిన) - 1 టీస్పూన్
  11. ఉల్లి( సన్నగా తరిగిన)- 1/2 కప్పు
  12. లవంగాలు - 2
  13. జీలకర్ర - 1 టీస్పూన్
  14. పల్లి(ఉడకబెట్టిన)- 1/2 కప్పు

సూచనలు

  1. నానబెట్టిన సెనగపప్పు ని మరియు పల్లిలని విడిగా ఉడకబెట్టుకోవాలి
  2. అన్ని పదార్ధాలని సిద్ధం చేసుకోవాలి.
  3. అటుకులని పొడి చేసుకోవాలి.అలాగే మిగిత పదార్ధాలని సిద్ధం చేసుకోవాలి.
  4. మసాల కి కావాల్సిన పదార్ధాలని సిద్ధం చేసుకోవాలి.
  5. ఇప్పుడు ఒక డ్రై మిక్సీ జార్ లో ఉడకబెట్టిన సెనగపప్పు, ఉడకబెట్టిన పల్లి,కూరగాయలు(బంగాళదుంప,క్యారెట్) ని బరకగా రుబ్బుకోవాలి.
  6. ఇందులో మసాలా దింసులని కూడా వేసి చక్కగా రుబ్బుకోవాలి.
  7. ఇప్పుడు తురిమిన టోఫు, తగినంత ఉప్పు వేసుకోవాలి.
  8. ఈ మిశ్రమంలో తరిగిన ఉల్లి, కరివేపాకు, అటుకుల పొడి, కారం వేసి శుభ్రంగా కలపాలి.
  9. మిశ్రమం బరకగా ఉండాలి.
  10. ఇంతలోపు గ్రిల్ ని 10నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి.
  11. ప్రీహీట్ అయ్యేలోపు, వుడెన్ స్క్యువెర్స్ లేదా చాప్ స్టిక్స్ ని మంచి నీటి లో 15 నిమిషాలు నానబెట్టాలి.ఇలా చేస్తే మిశ్రమం వీటిని అంటుకోదు.
  12. ఈస్టిక్స్ పై నూనె రాయాలి.
  13. మిశ్రమం లో కొద్దీ పాటి ముద్ద ని తీసుకొని కబాబ్ లాగా తయ్యార్ చేసుకొని స్టిక్స్ పై పెట్టుకోవాలి. వీటికి నూనె రాయాలి.
  14. ఈ కబాబ్స్ ని గ్రిల్ లో పెట్టి 25 నుండి 30 నిముషాల వరకు 250 డిగ్రీ C వద్ద కుక్ చేసుకోవాలి.
  15. టోఫు గ్రిల్డ్ కబాబ్స్ టీ తో లేదా కాఫీ తో సర్వ్ చేసుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర