హోమ్ / వంటకాలు / టమాట బజ్జి

Photo of Tomato bajji by Sree Sadhu at BetterButter
757
4
5.0(0)
0

టమాట బజ్జి

May-27-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాట బజ్జి రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది ఇంటికి వచ్చిన అతిధులికి పెడితే బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. గుండ్రటి టమాటాలు 3-6
  2. సెనగపిండి 1 కప్
  3. బియ్యంపిండి 5-6 చెంచాలు
  4. ఉప్పు తగినంత
  5. కారం 1 చెంచా
  6. వాము 1/2 చెంచా
  7. మరమరాలు 1 కప్
  8. ఉల్లిపాయ 1
  9. కొత్తిమీర 1 చెంచా
  10. చాట్ మసాలా 1 చెంచా
  11. నిమ్మరసం 1 చెంచా
  12. వేయించిన పల్లీలు 3 చెంచాలు
  13. వేయించిన సెనగపప్పు 2-3 చెంచాలు
  14. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో సెనగపిండి, బియ్యంపిండి, ఉప్పు ,కారం ,వాము నీళ్లు పోసుకొని బజ్జి పిండి ల చేసుకొని పక్కన పెట్టుకోవాలి
  2. ఇప్పుడు టమాట ని బాగా కడిగి తుడుచుకోవాలి
  3. ఇప్పుడు కడాయి లో నూనె కాచుకోవాలి
  4. ఆ బజ్జి పిండిలో టమాటలని ముంచి నూనె లో వేసి వేయించాలి
  5. అవి సగం వేగాక తీసి మళ్ళి పిండిలో ముంచి నూనె లో వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి
  6. అవి చాలారిన తరువాత మధ్యలోకి కోసుకోవాలి
  7. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో టమాట రసం గింజలు (మధ్యలో భాగం )వేసుకోవాలి
  8. అందులో తరిగిన ఉల్లిపాయ ,వేసుకొని బాగా కలిపి ఉప్పు, కారం కొత్తిమీర చాట్ మసాలా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి
  9. కలుపుకున్న తరువాత వేయించిన పల్లీలు ,సెనగపప్పు మరమరాలు వేసి మరోసారి అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి
  10. ఇప్పుడు దానిని వేయించిన టమాటాలో కురుకోవాలి
  11. అంతే పైన కొంచెం కొత్తిమీర జల్లుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర