మొత్తు గారెలు (పొద్దు తిరుగుడు పువ్వు గింజలుతో) | Protein Flatters (With sun flower seeds) Recipe in Telugu

ద్వారా Suma Malini  |  28th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Protein Flatters (With sun flower seeds) recipe in Telugu,మొత్తు గారెలు (పొద్దు తిరుగుడు పువ్వు గింజలుతో), Suma Malini
మొత్తు గారెలు (పొద్దు తిరుగుడు పువ్వు గింజలుతో)by Suma Malini
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

మొత్తు గారెలు (పొద్దు తిరుగుడు పువ్వు గింజలుతో) వంటకం

మొత్తు గారెలు (పొద్దు తిరుగుడు పువ్వు గింజలుతో) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Protein Flatters (With sun flower seeds) Recipe in Telugu )

 • నానపెట్టి ఆవిరిపట్టిన ముడి సెనగపప్పు 250 గ్రా
 • పాద్దుతిరుగుడు పువ్వు గింజలు 100గ్రా
 • ఉప్పు రుచికి తగినంత
 • కారం చెంచాడు
 • నూనె వేయించడానికి లేదా వెన్న పూస కాల్చుకోవడానికి.

మొత్తు గారెలు (పొద్దు తిరుగుడు పువ్వు గింజలుతో) | How to make Protein Flatters (With sun flower seeds) Recipe in Telugu

 1. ఆవిరిపై ఉడికించిన ముడి సెనగపప్పు మెత్తగా రుబ్బి ఉప్పు,కారం, పొద్దు తిరుగుడు పువ్వు గింజలు కలిపుకోవాలి.
 2. పళ్లానికి వెన్న పూస రాసి ఈ ముద్దని పల్చగా పేర్చి కోరిన ఆకారంలో కోసుకోవాలి.
 3. మరో పద్ధతి ఒక తెల్లని పల్చని బట్టని తడిపి గట్టిగా పిండి దాని మీద సగ భాగంలో చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పేర్చి మరొక సగభాగం గుడ్డ ఉండలపై కప్పి చదునైన మట్టు ఉన్న కప్పుతో మెత్తగా మొత్తాలి.
 4. వీటిని తీసుకుని సమానంగా కాగిన నూనెలో వేయించాలి. లేదా హాట్ ఎయిర్ ఫైయర్ లో వెన్న పూస రాసి కాల్చుకోవాలి.
 5. అంతే ఎంతో రుచిగా ఉండే మొత్తు గారెలు రెడీ. మీరు చేసుకొని ఆనందించండి. రుచి తో పాటు హెల్త్ కూడా.

నా చిట్కా:

వీటిని పెనం మీద లేదా హాట్ ఎయిర్ ఫైయర్ లో కూడా చేసుకోవచ్చు. కరకర లాడాలి అనుకుంటే బియ్యం పిండి 50 గ్రా కలిపితే సరి.

Reviews for Protein Flatters (With sun flower seeds) Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo