Photo of Pani puri by Sree Sadhu at BetterButter
911
7
5.0(0)
0

Pani puri

May-28-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. ఒక కప్పు బొంబాయి రవ్వ
  2. మూడు చెంచాలు మైదా
  3. పావు చెంచా బేకింగ్ సోడా
  4. ఉప్పు తగినంత
  5. వేయించేందుకు సరిపడా వంట నూనె.
  6. 5-6 ఉసిరికాయలు
  7. రెండు కప్పుల నీరు
  8. రెండు చెంచాలు జీలకర్ర పొడి
  9. రెండు చెంచాలు జీలకర్ర
  10. మూడు పచ్చి మిరపకాయలు
  11. ఒక కప్పు పుదీనా ఆకులు
  12. ఒక చెంచా నల్ల ఉప్పు
  13. అర కప్పు కీర
  14. అర కప్పు కొత్తిమీర ఆకులు
  15. రెండు బంగాళాదుంపలు
  16. రెండు తరిగిన పచ్చి మిరపకాయలు
  17. రెండు తరిగిన ఉల్లిపాయ ముక్కలు
  18. రుచి కోసం కాస్తంత ఉప్పు
  19. ఉడికించిన బఠాణి 1 కప్

సూచనలు

  1. ఒక పాత్ర తీసుకుని అందులో బొంబాయి రవ్వ వేసుకోవాలి
  2. కాస్తంత ఉప్పు వేసి, వేడి నీరు పోసి బాగా కలిపిన తర్వాత 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
  3. ఆ తర్వాత పిండిని చాలా చిన్న పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి.
  4. ఇప్పుడు పానీ కి మిక్సీ జార్ లో ఉసిరికాయ, పుదీనా ,జీలకర్ర ,పచ్చిమిర్చి, వేసి పేస్ట్ చేసుకోవాలి
  5. దీనికి నీటిని కలుపుకోవాలి.
  6. తర్వాత పానీకి సంబంధించి ఇతర ముడి పదార్థాలను కూడా కలపాలి.
  7. మీ రుచికి అనుగుణంగా కొన్ని ఎక్కువ, తక్కువ వేసుకోవచ్చు
  8. బంగాళాదుంపలను ఉడకబెట్టి దించేయాలి.
  9. బఠాణి కూడా మెత్తగా ఉడకబెట్టుకోవాలి
  10. వీటిని గుజ్జుగా చేసి పొయ్యిపై పెనం పెట్టి కాస్తంత నూనె వేసి ఈ మిశ్రమంలో తరిగిన పచ్చి మిరపకాయలు, తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి.
  11. వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి గరిటెతో కలియబెడుతూ వేడెక్కిన తర్వాత దించేయాలి. దీంతో స్టఫ్ రెడీ.
  12. అంతే పూరి లో కూర పానీ వేసుకొని తినడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర