హోమ్ / వంటకాలు / తందూరీ మోమోస్

Photo of Tandoori momos by Sree Sadhu at BetterButter
651
4
5.0(0)
0

తందూరీ మోమోస్

May-29-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తందూరీ మోమోస్ రెసిపీ గురించి

ఇది అందరు ఇష్టపడే సులువైన రుచికరంగా ఉండే మోమోస్

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. మైదా 1/2 కప్
  2. ఉప్పు తగినంత
  3. కారం 1/2 చెంచా
  4. పెరుగు 1/2 కప్
  5. గరం మసాలా 1/2 చెంచా
  6. పసుపు 1/4 చెంచా
  7. కొత్తిమీర 2 చెంచాలు
  8. పుదీనా 2 చెంచాలు
  9. నూనె వేయించడానికి సరిపడా
  10. అల్లం వెల్లులి ముద్ద 1 చెంచా
  11. సెనగపిండి 2 చెంచాలు
  12. ఉల్లిపాయ 1
  13. బంగాళదుంప 1
  14. టోఫు 1 కప్
  15. కాప్సికం 1
  16. బఠాణి 1/2 కప్
  17. క్యారెట్ 1
  18. పనీర్ 1 కప్
  19. చాట్ మసాలా 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో పెరుగు వేసి బాగా బీట్ చేసుకోవాలి
  2. అందులో ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, అల్లం వెల్లులి పేస్ట్ ,సెనగపిండి 2 చెంచాలు,పసుపు వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో మరుగుతున్న వేడి నూనె కూడా వేసుకోవాలి
  4. ఇప్పుడు టోఫు క్యారెట్ కాప్సికం ఉల్లిపాయ తరుగుకోవాలి
  5. వాటిని మసాలా పెరుగు మిశ్రమం లో 30 నిముషాలు మ్యారినేట్ చేసుకోవాలి
  6. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మైదా పిండి ,ఉప్పు, నీళ్లు, వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి
  7. దానిని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  8. ఈలోపు మరో గిన్నె తీసుకొని అందులో తురిమిన పనీర్ ,బఠాణి ,క్యారెట్, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కారం, చాట్ మసాలా,గరం మసాలా, వేసి బాగా కాపుకోవాలి
  9. ఇప్పుడు మైదా పిండి మిశ్రమం లో చిన్న చిన్న ఉండలు తీసుకొని చిన్న పూరి ల చేసుకొని మధ్యలో చేసుకున్న కూరను కూరుకుని
  10. దానిని మోమోస్ ల చుట్టుకోవాలి
  11. ఇప్పుడు ఒక కడాయి లో నూనె వేసుకొని కాచుకోవాలి
  12. నూనె వేడి అయ్యిన తరువాత అందులో మోమోస్ వేసి వేయించుకోవాలి
  13. అవి వేగిన తరువాత వాటిని మ్యారినేట్ చేసిన వాటిలో వేసి మరో 10 నిమిషాలు ఉంచుకోవాలి
  14. ఇప్పుడు తందూరీ స్టిక్ తీసుకొని ఒక ఒక కూరగాయ ముక్క గుచ్చి మోమోస్ కూడా గుచ్చుకోవాలి
  15. ఇప్పుడు ఒక పెన్నం తీసుకొని బాగా కాగాక వీటిని నూనె వేసి అన్ని వైపుల కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర