హోమ్ / వంటకాలు / రాజా గింజలు

Photo of Healthy Royal Nuts by Suma Malini at BetterButter
0
0
0(0)
0

రాజా గింజలు

May-30-2018
Suma Malini
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాజా గింజలు రెసిపీ గురించి

ఇది చాలా ఆరోగ్యకరమైన వృక్ష సంబంధమైన పౌష్టికాహారం. బాదం గింజల్లో,అక్రూట్ గింజలు లోను విటమిన్-ఇ తో పాటు ఎన్నో పౌష్టిక విలువలు ఔషధీయ గుణాలు కలిగి ఉన్నాయి. ఇది పిల్లలు, పెద్దలు తమ తమ సంతోషకరమైన రోజుల్లో చేసుకుని ఆనందించవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బాదం పప్పు 20
  2. జీడిపప్పు 15
  3. ఆక్రుట్ 5
  4. పండు మిర్చి పేస్ట్ చిన్న చెంచాడు
  5. బియ్యం పిండి 1 చెంచాడు
  6. గోధుమ పిండి 1 చెంచాడు
  7. రంగు కోసం చిటికెడు పసుపు (బీట్ రూట్ రసం లేదా క్యారెట్ రసం వాడచ్చు)
  8. వేయించిన జీలకర్ర పొడి (ఐచ్ఛికం)

సూచనలు

  1. గింజలును నానబెట్టాలి.
  2. బాదం గింజలను మధ్యకు కోసి తొక్క వేరు చేయాలి. జీడిపప్పు మధ్యకు కోసి శుభ్రం చేసుకోవాలి.
  3. మిక్సీలో అక్రూట్ చెంచాడు పండు మిర్చి పేస్ట్, చెంచాడు బియ్యం పిండి వేయాలి.
  4. చెంచాడు గోధుమ పిండి, పెద్ద చెంచాడు పెరుగు చిటికెడు పసుపు, వెన్న పూస కొంచెం వేసి మిక్స్ చేయాలి.
  5. ఈ పిండితో ,4 చెంచాలు నువ్వులు కలపాలి.
  6. జీడిపప్పు, కలపాలి.
  7. బాదం పప్పు కలపాలి.
  8. హాట్ ఎయిర్ ఫైయర్ 10 నిమిషాలు 200 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర వేడి చేయాలి.
  9. తోపు పెట్టిన గింజలుని హాట్ ఎయిర్ ఫైయర్ గ్రిల్ కు వెన్న పూస రాసి విడిగా పేర్చాలి.
  10. 100 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర 10 నిమిషాలు కాల్చాలి.
  11. గింజలు హాట్ ఎయిర్ ఫైయర్ లోనే చల్లారాక కర కర లాడతాయి. వీటిని వేయించిన జీలకర్ర పొడి, సైంధవ లవణం జల్లుకుని తినొచ్చు. నాకు మాత్రం పెరుగు వల్ల ఉప్పు అవసరం అనిపించదు.చృసి జల్లుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర