బ్రెడ్ పిజ్జా పాకెట్స్ | Bread Pizza Pockets Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  31st May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bread Pizza Pockets recipe in Telugu,బ్రెడ్ పిజ్జా పాకెట్స్, Tejaswi Yalamanchi
బ్రెడ్ పిజ్జా పాకెట్స్by Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

0

బ్రెడ్ పిజ్జా పాకెట్స్ వంటకం

బ్రెడ్ పిజ్జా పాకెట్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bread Pizza Pockets Recipe in Telugu )

 • ఉల్లిపాయ ఒకటి
 • క్యారట్ 1
 • అల్లం ముక్క ఒక ఇంచ్ ఒకటి
 • వెల్లులి 2 రెమ్మలు
 • బీన్స్ 1
 • బంగాళదుంప 1
 • చీజ్ 6 చెంచాలు తరిగినది
 • నూనె 4 చెంచాలు
 • ఉప్పు 1 చెంచా
 • కారం 1 చెంచా
 • పిజ్జా సాస్ 4 చెంచాలు
 • బ్రెడ్ ముక్కలు 2

బ్రెడ్ పిజ్జా పాకెట్స్ | How to make Bread Pizza Pockets Recipe in Telugu

 1. ముందుగా అల్లం ,వెల్లులి,ఉల్లిపాయ,క్యారట్,బంగాళదుంప,స్వీటీకార్న్,బీన్స్ తీసుకోండి
 2. పిజ్జా సాస్ తీసుకోండి
 3. అల్లం,వెల్లులి, బంగాళదుంప ,బీన్ ,క్యారట్ ఉల్లిపాయ ని ముక్కలుగా చేస్కోండి
 4. పోయి మీద బండి పెట్టి నూనె వేసి కాగాక అల్లం వెల్లులి ముక్కలు వేసి వేయించండి
 5. తరువాత ఉల్లిపాయ ముక్కలని వేయించండి
 6. తరువాత మిగతా కురాగాయలని వేసి ఒక 5 నిమిషాలు వేయించండి(కాస్త కరకరలడనివండి మరి మెత్తగా వేగనివకండి)
 7. అవి వేగాక పిజ్జా సాస్ వేసి ఉప్పు,కారం వేసి ఒక రెండు నిమిషాలు వేయించండి
 8. వేయించుకున్న మిశ్రమం తయారు
 9. అది చాలరక దాని పైన తరిగిన చీజ్ వేసుకొని కలపండి.ఇప్పుడు స్టఫ్ తయారు
 10. బ్రెడ్ ముక్కలు తీసుకొని అంచులు తీసేయండి
 11. చపాతీలు చేసే కర్రతో బ్రెడ్ పైన కాస్త మెత్తగా చేస్కోండి
 12. దానిలో స్టఫ్ పెట్టి అన్ని వైపులా నీళ్లు అద్ది మూసేయండి
 13. పోయి మీద బండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసుకొని వేయించండి
 14. తయారు చేసుకున్న వాటిని బంగారు రంగు వొచ్చేదాక వేయించుకోండి
 15. అంతే బ్రెడ్ పిజ్జా పాకెట్స్ తయారు

నా చిట్కా:

బ్రెడ్ విడిపోయినట్లు ఉంటే నీళ్ళు చల్లి ఒత్తుకొంది

Reviews for Bread Pizza Pockets Recipe in Telugu (0)