ఆలూ బోండ | Aloo bonda Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Aloo bonda by Sree Vaishnavi at BetterButter
ఆలూ బోండby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

ఆలూ బోండ వంటకం

ఆలూ బోండ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Aloo bonda Recipe in Telugu )

  • ఉల్లిపాయ 1
  • కరివేపాకు 1 రెమ్మ
  • జీలకర్ర 1/3 చెంచా
  • ఆవాలు 1 చెంచా
  • వాము 1/2 చెంచా
  • సెనగపిండి 1 కప్
  • కారం 1 చెంచా
  • గరం మసాలా 1 చెంచా
  • ఉడికించిన బఠాణి 1/2 కప్
  • ఉడికించిన క్యారెట్ 1
  • కొత్తిమీర 2-3 చెంచాలు
  • పచ్చిమిర్చి 2-3
  • బంగాళదుంప 2-3
  • నూనె 2-3 చెంచాలు

ఆలూ బోండ | How to make Aloo bonda Recipe in Telugu

  1. ముందుగా ఉడికించిన ఆలూ, క్యారెట్ ,బఠాణి ఒక దగ్గర పెట్టుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె లో సెనగపిండి ఉప్పు కారం వాము నీళ్లు పోసి బజ్జి పిండిలా చేసుకోవాలి
  3. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి కొంచెం నూనె వేసుకొని అది కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి
  4. అది వేగిన తరువాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వేసి వేయించి ఉడికిన కూరగాయ ముక్కలు వేసుకొని 3-4 నిమిషాలు వేయించాలి
  5. ఇప్పుడు అందులో ఉప్పు ,కారం, గరం మసాలా ,వేసి బాగా కలిపి కొత్తిమీర వేసి కొంచెం మెత్తగా చేసుకొని చాలారుచుకోవాలి
  6. చల్లగా అయ్యిన తరువాత వాటిని ఉండలుగా చేసుకోవాలి
  7. ఇప్పుడు స్టవ్ మీద కడై పెట్టి ఈ ఉండలను బజ్జి పిండిలో ముంచి వేడి నూనె లో బంగారు రంగు వచ్చే వరకు వేయించడమే

నా చిట్కా:

నచ్చితే బజ్జి పిండిలో బియ్యంపిండి వేసుకోవచ్చు

Reviews for Aloo bonda Recipe in Telugu (0)