అటుకులు వడలు | Rice Flakes Flitters Recipe in Telugu

ద్వారా Suma Malini  |  1st Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Rice Flakes Flitters recipe in Telugu,అటుకులు వడలు, Suma Malini
అటుకులు వడలుby Suma Malini
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

0

0

అటుకులు వడలు వంటకం

అటుకులు వడలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rice Flakes Flitters Recipe in Telugu )

 • పచ్చి సెనగలు (పొలం తాజా) 100 గ్రా
 • అటుకులు 50 గ్రా
 • బంగాళదుంప 1
 • కొబ్బరి
 • కరివేపాకు గుప్పెడు
 • జీలకర్ర 20గ్రా
 • పచ్చి మిర్చి 6
 • ఉప్పు అవసరానికి తగ్గట్టు (కరివేపాకులో సహజమైన లవణాలు ఎక్కువ)
 • అల్లం అర అంగుళం
 • వెల్లుల్లి రెబ్బలు 6
 • ఉల్లిపాయలు

అటుకులు వడలు | How to make Rice Flakes Flitters Recipe in Telugu

 1. పచ్చి మిర్చి, జీలకర్ర, అల్లం, కరివేపాకు, వెల్లుల్లి అన్నీ మిక్సీలో వేసుకోవాలి.
 2. బంగాళదుంప తురుము కోవాలి.
 3. కొబ్బరి, సెనగలు ముక్కా, చెక్కలుగా రుబ్బుకోవాలి.
 4. ఉల్లిపాయలు సన్నగా తరగాలి ‌
 5. సెనగలు కొబ్బరి తురుము లో రుబ్బిన మసాలా, బంగాళదుంప తురుము, ఉల్లి తరుగు కడిగిన అటుకులు, అవసరం అయితే ఉప్పు కలుపుకోవాలి.
 6. దీనిని ఫొటోలో చూపిన విధంగా వడలుగా ఒత్తుకుని హాట్ ఎయిర్ ఫైయర్ లో 100 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర 30 నిమిషాలు బేక్ చేసుకోవాలి.
 7. రెండు వైపులా మీగడ లేదా వెన్న పూస రాసి బంగారు వర్ణం వచ్చేవరకు కాల్చుకోవాలి. అమ్మ వీటిని పెనం పైన కాల్చేశారు.

నా చిట్కా:

పచ్చి సెనగలు, అటుకులు బదులు నానపెట్టిన సెనగలు, బియ్యం వాడవచ్చు.

Reviews for Rice Flakes Flitters Recipe in Telugu (0)