హోమ్ / వంటకాలు / అల్లం ఇడ్లీ

Photo of Ginger idly by Sree Sadhu at BetterButter
347
1
0.0(0)
0

అల్లం ఇడ్లీ

Jun-02-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అల్లం ఇడ్లీ రెసిపీ గురించి

చిన్న పిల్లలి నుంచి పెద్ద వారి వరకు అందరు చాలా ఇష్టపడే విదేశీ వంట మంచూరియన్ కానీ ఈ వంటకం విదేశి వంటకేమి తక్కువ ఏమి కాదు ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఇడ్లీ నచ్చని వాళ్లకి ఇలా చేసి పెట్టండి ఇది వర్షాకాలం లో వేడి వేడి స్నాక్ గా చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. అల్లం 250 గ్రామ్స్
  2. చింతపండు నిమ్మకాయ పరిమాణం
  3. నూనె 2-3 చెంచాలు
  4. ఉప్పు తగినంత
  5. కారం 1 చెంచా
  6. పంచదార 2 చెంచాలు
  7. ఆవాలు 1/2 చెంచా
  8. జీలకర్ర 1/2 చెంచా
  9. మినపప్పు 1/2 చెంచా
  10. సెనగపప్పు 1/2 చెంచా
  11. పల్లీలు 1 చెంచా
  12. ఎండుమిరపకాయలు 2-3
  13. కరివేపాకు 1 రెమ్మ
  14. మిగిలిపోయిన మినీ ఇడ్లీ 15
  15. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొంచెం చింతపండు వేసుకోవాలి
  2. అది వేగిన తరువాత బాగా కడిగి ముక్కలుగా కోసుకొని వేయించుకోవాలి
  3. అందులో 2 ఎండుమిరపకాయలు వేసి వేయించాలి
  4. అందులో తగినంత ఉప్పు కారం పంచదార వేసుకోవాలి
  5. అందులో కొంచం నీళ్లు పోసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి
  6. ఇప్పుడు మళ్ళి కడాయి పెట్టి అందులో నూనె వేసి కాగాక ఆవాలు జీలకర్ర వేసి వేయించాలి
  7. అది వేగిన తరువాత పల్లీలు మినపప్పు సెనగపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి వేయించాలి
  8. ఇప్పుడు అందులో చేసుకున్న పేస్ట్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి
  9. ఇలా ఇడ్లిని పక్కన పెట్టుకోవాలి
  10. ఇప్పుడు ఆలా పక్కన పెట్టుకున్న ఇడ్లి ని వేగుతున్న దానిలో వేసుకోవాలి
  11. అవి అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర