హోమ్ / వంటకాలు / మసాలా వడ

Photo of Masala vada by Sree Sadhu at BetterButter
686
1
0.0(0)
0

మసాలా వడ

Jun-02-2018
Sree Sadhu
240 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా వడ రెసిపీ గురించి

మసాలా వడలు చాలా తేలికగా చేసుకోదగ్గ ఎంతో రుచికరమైన ఈవెనింగ్ స్నాక్ ఐటమ్.ఎవరైనా గెస్ట్ లు వస్తున్నప్పుడు ఉదయాన్నే పప్పు నానబెట్టేసుకుంటే, అప్పటికప్పుడు పిండి రుబ్బి అరగంటలో ఎంచక్కా మసాలా వడలు చేసి పెట్టవచ్చు.పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. 200 గ్రాములు పచ్చిశనగ పప్పు
  2. 2 పచ్చిమిరపకాయలు
  3. 1 రెమ్మ కరివేపాకు
  4. 1 చిన్న ఉల్లిపాయ
  5. ¼ కొత్తిమీర తరుగు
  6. ఉప్పు
  7. జీలకర్ర 1 చెంచా
  8. ఎండుమిరపకాయలు 4
  9. నూనె వేయించడానికి సరిపడా
  10. సెనగపిండి 1/2 కప్

సూచనలు

  1. ముందుగా సెనగపప్పును 4-5 గంటలు నానబెట్టుకోవాలి
  2. నానబెట్టిన పప్పును మిక్సీలో వేసి నీళ్ళు పోయకుండా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
  3. ఇప్పుడు దానిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి
  4. అందులో తరిగిన కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు ,పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వేసుకోవాలి
  5. వాటి అన్నిటికి బాగా కలిసేలా కలుపుకోవాలి
  6. అది వడ ల చేతికి అవ్వకపోతే కొంచెం సెనగపిండి వేసుకోవచ్చు
  7. ఒక బాణలిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి వేడి చేయాలి.
  8. కొద్దిగా నూనెను అరచేతికి రాసుకొని ఒక ప్లాస్టిక్ షీట్ మీద నిమ్మకాయ పరిమాణంలో పిండిని తీసుకొని గుండ్రంగా వడలా తట్టి నూనెలో జారవిడవాలి.
  9. మరీ పెద్ద మంట మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద ఉంచి వడలు చక్కని బంగారు వర్ణంలోకి మారే వరకు వేయించాలి.
  10. వేయించిన వడలను పేపర్ టవల్ మీదకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి.ఇలాగే పిండి అంతా అయిపోయే వరకు వేయించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర