చికెన్ చిస్ ప్రాంకిస్ | Chicken chees Frankie s Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  2nd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Chicken chees Frankie s recipe in Telugu,చికెన్ చిస్ ప్రాంకిస్, Deepika Goud
చికెన్ చిస్ ప్రాంకిస్by Deepika Goud
 • తయారీకి సమయం

  59

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

3

0

చికెన్ చిస్ ప్రాంకిస్ వంటకం

చికెన్ చిస్ ప్రాంకిస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chicken chees Frankie s Recipe in Telugu )

 • చికెన్ 1/4 కిలో (boneless)
 • మైదా 1 కప్పు
 • గొదుమపిండి 1/2కప్పు
 • గుడ్లు 2
 • నిమ్మరసం 1 చెంచా
 • చీజ్ 1/2 కప్పు
 • టమాట ప్యురి 1/2కప్పు
 • ఉల్లిపాయ పెస్టు కొద్దిగా
 • టమాటాలు 2 సన్నగా తరగాలి
 • ఉల్లిపామ 1సన్నగా తరగాలి
 • పచ్చిమిర్చి 2 సన్నగా తరిగినవి
 • అల్లం పేస్టూ 1 చెంచా
 • వెల్లిఉల్లి 1 చెంచా
 • గరంమసాలా 1 చెంచా
 • ధనియాల పొడి 1 చెంచా
 • కారం. 1చెంచా
 • ఉప్పు రుచికి సరిపడ
 • కొత్తిమీరు కొద్దిగా
 • పుదీన కొద్దిగా

చికెన్ చిస్ ప్రాంకిస్ | How to make Chicken chees Frankie s Recipe in Telugu

 1. ముందుగా గిన్నెలొ మైదా,గొదుమపిండి,ఉప్పు కొద్దిగా మరియు కాస్త నూనె వేసి మెత్తగా చపాతి పిండి కలిపి ఒక 30నిమిషాలు పక్కన పెట్టాలి
 2. ఇపుడు చికెన్ ని తీసుకొని శుభ్రం చెయ్కాలి.తరువాత చికెన్ ని మిక్స్కీ పట్టాలి .తరువాత దానికి అల్లం వేల్లి పేస్టు,కారం,పసుపు కలిపి పక్కన పెట్టాలి.
 3. స్టౌ పెన గిన్నె పెట్టి నూనె వెసి చికెన్ ని వేయాలి . 5నిమిషాలు ఉడికించి దానిలొ ఉల్లిపాయ ముద్ద ,తరువాత టమాటొ ప్యూరి ఉప్పు వేసి ఉడకనివ్వాలి .ఇప్పుడు గరంమసాలా.ధనియాపొడి ,కొత్తిమిరా,పుదిన వేసి దగ్గరగ అయ్యెలా ఉడికించాలి(కొంచం జూసి జూసి గా ఉంటె బావుంటుంది).కొంచం చల్లారాక నిమ్మరసం వేయాలి.
 4. ఇప్పుడు చీజ్ ని తురిమి పక్కన పెట్టుకొవాలి.
 5. ఉల్లిపాయ,టమాటొ ని పచ్చిమి‍ర్చిని సన్నగా తరిగి కొంచం ఉప్పు చల్లి పక్కన పెట్టుకొవాలి.
 6. ఇప్పుడు చపాతి పిండిని తీసుకుని 3చపాతీలు పలచగా ఒత్తుకోవాలి .స్టౌ పైన పెనం పెట్టి చపాతీలు .కాల్చుకొవాలి.ఇప్పుడు ఒక చపాతీపైన మరొకటి ఇలా మూడు వేసి కాలుస్తూ దాని పైన ఎగ్ ని వేయాలి.దానిని చపాతి పైన నేర్పుకోవాలి .దానిపైన ముందుగా తయారు చేసిపెట్టిన చికెన్ ని తరువాత చిస్ తరిగిన ఉల్లి టమాటొ ముక్కలూ పరచాలి.తరువాత దానిని గట్టిగా రొల్ చేయాలి
 7. రొల్ నుండి కూర బైటకి రాకుండా టిష్యు కాని,అల్యూమినియం ఫయిల్ కాని చుట్టుకోవాలి .
 8. అంతే ఎంతో రుచిగా ఉండే చికెన్ చీజ్ ఫ్రాంకీ రెడీ . మీరు చేసుకొని ఆనందించండి.

Reviews for Chicken chees Frankie s Recipe in Telugu (0)