మీల్ మేకర్ కట్లెట్ | Soya chunks cutlet/ meal maker cutlet Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  2nd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Soya chunks cutlet/ meal maker cutlet recipe in Telugu,మీల్ మేకర్ కట్లెట్, Tejaswi Yalamanchi
మీల్ మేకర్ కట్లెట్by Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

2

0

మీల్ మేకర్ కట్లెట్ వంటకం

మీల్ మేకర్ కట్లెట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Soya chunks cutlet/ meal maker cutlet Recipe in Telugu )

 • బంగాళదుంప 1
 • క్యారెట్ 1
 • ఉల్లిపాయ 1
 • ఉప్పు తగినంత
 • కారం ఒక చెంచా
 • పసుపు చిటికెడు
 • ధనియాల పొడి 1/2 చెంచా
 • జీలకర్ర 1 చెంచా
 • నూనె 4 చెంచాలు
 • గరంమసాలా 1/4 చెంచా
 • మీల్ మేకర్ 25 ముక్కలు
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా
 • మైదా 1 చెంచా
 • మొక్కజొన్న పిండి 1 చెంచా

మీల్ మేకర్ కట్లెట్ | How to make Soya chunks cutlet/ meal maker cutlet Recipe in Telugu

 1. ముందుగా క్యారెట్, బంగాళదుంప, ఉల్లిపాయ ,మీల్ మేకర్, ఉప్పు ,కారం , ధనియాలపొడి ,గరంమసాలా, పసుపు ,అల్లంవెల్లుల్లి పేస్ట్ని సిద్ధం చేసుకోండి
 2. ఉల్లిపాయ మరియు క్యారెట్ ని ముక్కలుగా తరిగి పెట్టుకోండి
 3. బంగాళదుంప ,మీల్ మేకర్ ని నీళ్ల లో వేసి ఉడికించుకోండి
 4. ఉడికిన బంగాలదుంప నీ మెత్తగా చేసి పక్కన ఉంచుకోండి
 5. మీల్ మేకర్ లో నీరు పిండేసి మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్టు లా చేసుకోండి
 6. దానిలో మెత్తగా చేసుకుని బంగాళదుంపను వేసుకోండి
 7. ఇప్పుడు పోయి మీద ఒక బాండిపెట్టి దాంట్లో నూనె వేసుకొని నూనె కాగాక జీలకర్ర వేయించాలి
 8. ఆ తర్వాత క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోండి
 9. ఆ తర్వాత దానిలో ఉప్పు పసుపు కారం ధనియాలపొడి గరంమసాలా అల్లంవెల్లుల్లిపేస్ట్ అన్ని వేసి కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు వేయించి గిన్నెలోకి తీసుకోండి
 10. గిన్నెలో మిశ్రమాన్ని బాగా కలుపుకొని వాటిని కట్లెట్ లాగా చేసుకోండి
 11. మరొక గిన్నెలో ఒక చెంచా మైదా ఒక చెంచా మొక్కజొన్నపిండి వేసుకోండి
 12. దానిలో నీరు పోసుకొని కాస్త జారుడుగా చేసుకోండి
 13. దానీలో ముందుగా చేసుకున్న కట్లెట్ ని ముంచుకొని తీయండి
 14. ఒక ప్లేట్లో బ్రెడ్ క్రంబ్స్ తీసుకోండి
 15. మైదా మొక్కజొన్న పిండి మిశ్రమంలో ముంచిన కట్లెట్లను బ్రెడ్ క్రంబ్స్ అద్ది పక్కన పెట్టుకోండి
 16. పొయ్యి మీద పెనం పెట్టి అది వేడెక్కాక కాస్త నూనె రాయండి
 17. కట్లెట్ లను పెనం పైన వేసి రెండువైపులా బంగారు రంగు వచ్చేంత వరకు కాలుచుకోండి
 18. మీల్ మేకర్ కట్లెట్స్ తయారు. మీరు చేసుకొని ఆనందించండి .

Reviews for Soya chunks cutlet/ meal maker cutlet Recipe in Telugu (0)