BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మీల్ మేకర్ కట్లెట్

Photo of Soya chunks cutlet/ meal maker cutlet by Tejaswi Yalamanchi at BetterButter
0
0
0(0)
1

మీల్ మేకర్ కట్లెట్

Jun-02-2018
Tejaswi Yalamanchi
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మీల్ మేకర్ కట్లెట్ రెసిపీ గురించి

బంగాళదుంప మీల్ మేకార్ ని ఉడికించి మెత్తగా చేసుకొని వాటిలో వేయించుకున్న ఉల్లిపాయ క్యారట్ ముక్కలు వేసి కట్లెట్ లాగా చేసుకొని వాటిని మైదా మొక్కజొన్న పిండి కలిపిన మిశ్రమంలో ముంచి తీసి బ్రెడ్ క్రంబ్స్ ని అద్ది పెనం పైన కాల్చుకుంటాము. రుచిలో ఎంతో అమోఘం మరియు ఒంటికి సరిపడా ప్రోటీన్ అందించే పౌష్టికమైన రెసిపీ . వేడి వేడి టీ తో పాటు సాయంత్రం తీసుకోవటానికి భలే గా ఉంటుంది .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బంగాళదుంప 1
  2. క్యారెట్ 1
  3. ఉల్లిపాయ 1
  4. ఉప్పు తగినంత
  5. కారం ఒక చెంచా
  6. పసుపు చిటికెడు
  7. ధనియాల పొడి 1/2 చెంచా
  8. జీలకర్ర 1 చెంచా
  9. నూనె 4 చెంచాలు
  10. గరంమసాలా 1/4 చెంచా
  11. మీల్ మేకర్ 25 ముక్కలు
  12. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా
  13. మైదా 1 చెంచా
  14. మొక్కజొన్న పిండి 1 చెంచా

సూచనలు

  1. ముందుగా క్యారెట్, బంగాళదుంప, ఉల్లిపాయ ,మీల్ మేకర్, ఉప్పు ,కారం , ధనియాలపొడి ,గరంమసాలా, పసుపు ,అల్లంవెల్లుల్లి పేస్ట్ని సిద్ధం చేసుకోండి
  2. ఉల్లిపాయ మరియు క్యారెట్ ని ముక్కలుగా తరిగి పెట్టుకోండి
  3. బంగాళదుంప ,మీల్ మేకర్ ని నీళ్ల లో వేసి ఉడికించుకోండి
  4. ఉడికిన బంగాలదుంప నీ మెత్తగా చేసి పక్కన ఉంచుకోండి
  5. మీల్ మేకర్ లో నీరు పిండేసి మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్టు లా చేసుకోండి
  6. దానిలో మెత్తగా చేసుకుని బంగాళదుంపను వేసుకోండి
  7. ఇప్పుడు పోయి మీద ఒక బాండిపెట్టి దాంట్లో నూనె వేసుకొని నూనె కాగాక జీలకర్ర వేయించాలి
  8. ఆ తర్వాత క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోండి
  9. ఆ తర్వాత దానిలో ఉప్పు పసుపు కారం ధనియాలపొడి గరంమసాలా అల్లంవెల్లుల్లిపేస్ట్ అన్ని వేసి కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు వేయించి గిన్నెలోకి తీసుకోండి
  10. గిన్నెలో మిశ్రమాన్ని బాగా కలుపుకొని వాటిని కట్లెట్ లాగా చేసుకోండి
  11. మరొక గిన్నెలో ఒక చెంచా మైదా ఒక చెంచా మొక్కజొన్నపిండి వేసుకోండి
  12. దానిలో నీరు పోసుకొని కాస్త జారుడుగా చేసుకోండి
  13. దానీలో ముందుగా చేసుకున్న కట్లెట్ ని ముంచుకొని తీయండి
  14. ఒక ప్లేట్లో బ్రెడ్ క్రంబ్స్ తీసుకోండి
  15. మైదా మొక్కజొన్న పిండి మిశ్రమంలో ముంచిన కట్లెట్లను బ్రెడ్ క్రంబ్స్ అద్ది పక్కన పెట్టుకోండి
  16. పొయ్యి మీద పెనం పెట్టి అది వేడెక్కాక కాస్త నూనె రాయండి
  17. కట్లెట్ లను పెనం పైన వేసి రెండువైపులా బంగారు రంగు వచ్చేంత వరకు కాలుచుకోండి
  18. మీల్ మేకర్ కట్లెట్స్ తయారు. మీరు చేసుకొని ఆనందించండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర