హోమ్ / వంటకాలు / మసాలా పూరి

Photo of MASALA PURI by Ram Ram at BetterButter
971
0
0.0(0)
0

మసాలా పూరి

Jun-03-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా పూరి రెసిపీ గురించి

ఇవి చాలా రుచిగా ఉంటాయి...మనం ఇంటిలో చేసుకోవచ్చు...వర్షంగా ఉన్నపుడు రుచిగా తినాలి అనిపించే ఆహారం..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • రాజస్థాన్
  • చల్లగా చేసుకోవటం
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 1కప్పు
  2. బొంబాయి రవ్వ 1కప్పు
  3. ఉప్పు సరిపడా
  4. ఉడికించిన శనగలు 5స్పూన్లు
  5. ఉడికించిన బంగాళదుంప 1
  6. చాట్ మసాలా 2స్పూన్లు
  7. కారం 2స్పూన్లు
  8. నిమ్మకాయ 1
  9. కొత్తిమీర కొద్దిగా
  10. పుదీనా కొద్దిగా
  11. నూనె డీప్ ఫ్రైకి

సూచనలు

  1. ముందుగా 1కప్పు మైదా 1కప్పు బొంబాయి రవ్వ 2స్పూన్ల నూనె ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోస్తూ పూరి పిండిలా కలుపుకుని 10నిమిషాలు పక్కన పెట్టుకోవాలి...
  2. ఈలోపు శనగలు బంగాళాదుంపని ఉడికుంవహుకోవాలి..
  3. ఇప్పుడు ఒక పెద్దది మందంగాను పల్చగాను కాకుండా పురిలా చేసుకుని రౌండ్ మూతతో పురిలాల కట్ చేసుకోవాలి...
  4. ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె స్టవ్ మీద పెట్టి వేడి అయ్యిన తర్వాత కట్ చేసిన పూరీలను వేసి నూనెలోకి గారిటతో వొత్తుతుంటే పూరీలు ఉబ్బి వస్తాయి..బంగారు రంగులో వేయించుకుని పక్కకు తీసుకోవాలి..
  5. ఇప్పుడు ఉడికించిమ బంగాళాదుంపని తొక్క తీసి మాష్ చేసి ఉప్పు కారం1స్పూన్ 1స్పూన్ చాట్ మసాలా వేసి అంత బాగా కలుపుకుని పెట్టుకోవాలి...
  6. ఇప్పుడు పూరీలను ఒక ప్లేటులో అమర్చి కన్నం చేసి..బంగాళదుంప మిశ్రమాన్ని అన్ని పూరీలలో కొద్దికొద్దిగా పెట్టాలి ..
  7. ఇప్పుడు ఇంకో స్పూన్ చాట్ మసాలా,కొద్దిగా ఉప్పు,1స్పూన్ కారం అన్నీటి. మీద. చల్లుకోవాలి..ఇప్పుడు ఉడికించిన శనగలు పుదీనా కొత్తిమీర అన్నింటిలో వేసుకోవాలి...
  8. చివరిగా నిమ్మరసం అన్నిటి మీద పిండుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర