హోమ్ / వంటకాలు / ఉగ్గాని మరియు ఉల్లి పకోడి

Photo of Uggani with onion pakodi by Sree Sadhu at BetterButter
465
1
0.0(0)
0

ఉగ్గాని మరియు ఉల్లి పకోడి

Jun-04-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉగ్గాని మరియు ఉల్లి పకోడి రెసిపీ గురించి

మాములుగా ఉగ్గాని ని మిర్చి బజ్జి తో తింటారు కాని కొత్తగా ఉగ్గాని ఉల్లిపాయ పకోడి తో తినచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. నూనె వేయించడానికి సరిపడా
  2. మరమరాలు 2 కప్పులు
  3. ఉల్లిపాయ 1
  4. టమాట 1
  5. కొత్తిమీర 2 చెంచాలు
  6. మినపప్పు 1 చెంచా
  7. సెనగపప్పు 1 చెంచా
  8. ఆవాలు 1 చెంచా
  9. జీలకర్ర 1 చెంచా
  10. కరివేపాకు 1 రెమ్మ
  11. ఉప్పు తగినంత
  12. కారం 1/2 చెంచా
  13. పసుపు చిటికెడు
  14. పల్లీలు 2-3 చెంచాలు
  15. నిమ్మరసం 1 చెంచా
  16. సెనగపిండి 1 కప్
  17. బియ్యంపిండి 3 చెంచాలు
  18. సన్నగా తరిగిన ఉల్లిపాయ 2-3
  19. దంచిన ధనియాలు 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ,ఉప్పు ,కారం, దంచిన ధనియాలు, వేసి బాగా కలపాలి
  2. అందులో కొంచెం తడి వచ్చాక తగినంత సెనగపిండి, బియ్యంపిండి వేసి బాగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసి కాచుకోవాలి
  4. నూనె వేడి అయ్యిన తరువాత పకోడీల నూనె లో వేసి వేయించుకోవాలి
  5. ఇప్పుడు మళ్ళి బాండి పెట్టి అందులో నూనె వేసి కాచుకోవాలి
  6. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు ,జీలకర్ర ,మినపప్పు, సెనగపప్పు పల్లీలు ,నిమ్మరసం వేసి వేయించాలి
  7. వేగిన తరువాత కరివేపాకు ,ఉల్లిపాయ, టమాట వేసి వేయించాలి
  8. అవి వేగిన తరువాత అందులో ఉప్పు, కారం, పసుపు, వేసి వేగిన తరువాత అందులో నానబెట్టిన మరమరాలు వేసి రెండు నిమిషాలు వేయించి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర