హోమ్ / వంటకాలు / పెసర పుణుగులు

Photo of PESARA PUNUGULU by Ram Ram at BetterButter
856
0
0.0(0)
0

పెసర పుణుగులు

Jun-04-2018
Ram Ram
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసర పుణుగులు రెసిపీ గురించి

పెసర పునుగులు ఎంతో ప్రాచీన మరియు పౌష్టికారమైన వంటకం. పెసర్లు శరీరానికి అవసరమున్న ప్రోటీన్లు మరియు మినరల్స్ అందించడంలో ఎంతో సహాయపడతాయి. పెసర పునుగులు చేసుకోవటం మహా సులువు . ఇవి చాలా రుచిగా ఉంటాయి.పెసర పునుగులను చిరుతిండి మరియు కూర లాగ కూడా వండుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పెసరపప్పు 1/4 కేజీ
  2. ఇడ్లీ పిండి 1/4కప్పు(ఆప్షనల్)
  3. పచ్చిమిర్చి 5
  4. వెల్లులి రెబ్బలు 10
  5. అల్లం చిన్నముక్క
  6. జీలకర్ర 2స్పూన్లు
  7. ఉప్పు రుచికి సరిపడా
  8. నూనె వేయించడానికి saripada

సూచనలు

  1. పెసర పప్పుని ఒక 1 రోజు ముందు బాగా శుభ్రం చేసి సరిపడినన్ని నీళ్లు పోసి నానపెట్టుకోవాలి.
  2. నానిన పప్పును గ్రైండర్ లో వేసి ,పచ్చి మిర్చి ,2స్పూన్ల జీలకర్ర, వెల్లులి రెబ్బలు 10 ,అల్లం ముక్క ఇవన్నీ వేసి కొద్దిగా నీళ్లు పోసి గట్టిగా రుబ్బుకోవాలి.
  3. ఇప్పుడు ఒక గిన్నెలో రుబ్బుకున్న పిండిని తీసుకుని 1/4కప్పు ఇడ్లీ పిండి, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
  4. ఒక కడై లో వేయించడానికి నూనె పెట్టుకుని వేడి చేసుకోండి. నూనె వేడి అయ్యాక ఒక్కో చెంచాడు పిండిని గుండ్రంగా పోనుగులు వేసుకోవాలి. వాటిని దోరగా వేయించుకొని తీసుకోండి.
  5. ఎంతో రుచిగా ఉండే పునుగులు రెడీ. చేసుకొని ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర