హోమ్ / వంటకాలు / వేన్న ముద్దలు/ఉప్పుడు పిండి ముద్దలు

Photo of Uppu urndai by Deepika Goud at BetterButter
271
1
0.0(0)
0

వేన్న ముద్దలు/ఉప్పుడు పిండి ముద్దలు

Jun-05-2018
Deepika Goud
3 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వేన్న ముద్దలు/ఉప్పుడు పిండి ముద్దలు రెసిపీ గురించి

ఆవిరికి ఉడికించుకొని చేసుకొనే ఈ బియ్యంపిండి ఉప్పు ఉండ్రాయి ఎంతో రుచిగా ఉంటాయి మరియు ఎంతో ఆరోగ్యకరం కూడా. పిన్నా పెద్ద అందరూ ఇష్తంగా తింటారు. దీనిని తయారు చేసుకోవటం మహా సులువు అతి తక్కువ సమయంలో తేలికగా రెడీ అవుతాయి . బియ్యం పిండి తో చేసుకోవటం వలన కడుపూ నిండుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తమిళనాడు
  • ఆవిరికి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం 1కప్పు
  2. కొబ్బరి పొడి 1/4కప్పు
  3. పల్లిలు కొన్ని
  4. జీడిపప్పులు కొన్నీ
  5. నానపెట్టి పొట్టు తీసిన బాదం పలుకులు కొన్ని
  6. శనగపప్పు 3 టేబుల్ స్పూన్లు
  7. మినపప్పు 1సూన్
  8. జిలకర్ర,ఆవాలు 1టిస్పూన్
  9. ఉప్పు తగినంత
  10. నూనే
  11. వెల్లుల్లి రెబ్బలు 4
  12. ఉప్పు రుచికి సరిపడా

సూచనలు

  1. ముందురొజు రాత్రి లేదా 3 గంటలు పాటు బియ్యం బాగా కడిగి నాన పెట్టుకోవాలి .
  2. తరువాత మెత్తగా మిక్స్కీ పట్టుకొవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా మరీ జారుడుగా కాకుండా మధ్య రకం ఉండాలి.
  3. ఇప్పుడు దీనిలో కొబ్బరిపొడి వేసి కలపాలి.
  4. స్టౌ వేలిగించి కడాయి పెట్టి పొపు వేయాలి.నూనె కొద్దిగా పొసి వేడి అయ్యాక జిలకర్ర.ఆవాలు వేసి అవి వేగిన తరువాత వేల్లిఉల్లి రెబ్బలను నలగొట్టి వేయాలి.
  5. మినపప్పు,శనగపప్పు,జీడిపప్పు ,బాదం పప్పు కూడా వేసి వేయించాలి. తరువాత సరిపడా ఉప్పు వేసి కలపాలి.
  6. తరువాత ముందుగా సిద్దం చేసి పెట్టుకున్న బియ్యం పిండిని కలపాలి.కాసెపు స్టౌ పైన ఉంచాలి.పిండిలోని నీరు ఇగిరే వరకు ఉంచి స్టౌ అఫ్ చేసి కొద్దిగా చల్లారనివాలి.
  7. తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసి ఇడ్లి పాత్రలో పెట్టి ఆవిరికి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే ఉప్పు ఉండ్రాయి రెడీ వీటిని ప్లేట్ లోకి తిసుకొని టమాటొ చట్ని లేదా పల్లి చట్నీతొ తీసుకోవచ్చును.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర