హోమ్ / వంటకాలు / డ్రై ఫ్రూట్స్ లడ్డూ

Photo of DRY FRUITS LADOO by Ram Ram at BetterButter
561
1
0.0(0)
0

డ్రై ఫ్రూట్స్ లడ్డూ

Jun-05-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డ్రై ఫ్రూట్స్ లడ్డూ రెసిపీ గురించి

పలుకులు మరియు ఎండు పండ్లు వాడి చేసుకునే ఈ లడ్డూలు రుచి తో పాటు వంటికీ ఎంతో పౌష్టికరం కూడా . ఈ లడ్డూల తయారీలో వాడిన ఖజ్జూరం మరియు అంజీర పండ్ల లో ఐరన్ విలువలు మెండుగా ఉంటాయి ఇది రక్తం లో హిమోగ్లోబిన్ పెంచుటకు ఎంతో సహాయపడుతుంది. అలాగే జీడిపప్పు,బాదాంపప్పు ప్రోటీన్ మరియు ఖనిజవిలువలు అందచేయటం లో సహాయపడతాయి. పెరిగే పిల్లలకి మరియు వయసు పైబడ్డ వారికి ఎంతో శక్తి ని ఇస్తాయి.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చల్లగా చేసుకోవటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. గింజలు తీసిన ఖజ్జూరాలు 1కప్పు
  2. అంజీర్ 5
  3. ఎండు ద్రాక్ష 1/4కప్పు
  4. జీడిపప్పు 1/4కప్పు
  5. బాదం పప్పు 1/4కప్పు
  6. గసగసాలు 2స్పూన్లు
  7. నెయ్యి 2 స్పూన్లు

సూచనలు

  1. ముందుగా పాన్ పెట్టి నెయ్యి వేసి 1/4 కప్పు బాదం,1/4కప్పు జీడిపప్పు నేతిలో వేయించాలి...అవి వేగిన వెంటనే ,2స్పూన్ల గసగసాలు, 1/4కప్పు ఎండు ద్రాక్ష , అంజీర్ ముక్కలు వేసి వేయించి, గింజలు తీసి పెట్టుకున్న ఖజ్జూరం కూడా వెసి అంతా బాగా కలుపుకోవాలి.
  2. స్టవ్ ఆపి మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కచపచ్చగా మిక్సీ పట్టుకుని గిన్నెలో తీసుకోవాలి.
  3. ఇప్పుడు లడ్డూ ల చుట్టుకొని జీడిపప్పు పెట్టుకోవాలి.
  4. అంతే ఎంతో రుచిగా ఉండే మరియు శరీరానికి బలాన్ని చేకూర్చే డ్రై ఫ్రూప్ట్స్ లడ్డూ రెడీ. మీరూ చేసుకొని ఆనందించండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర