స్పెషల్ చికెన్ | Special chicken Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  6th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Special chicken recipe in Telugu,స్పెషల్ చికెన్, Tejaswi Yalamanchi
స్పెషల్ చికెన్by Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  2

  1 /2గంటలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

7

0

స్పెషల్ చికెన్ వంటకం

స్పెషల్ చికెన్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Special chicken Recipe in Telugu )

 • చికెన్ లెగ్ ముక్కలు 3 లేదా 250 గ్రాములు
 • గుడ్డు 1 తెల్ల సోనా మాత్రమె తీయండి
 • బ్రెడ్ క్రయంబ్స్ 1 చెంచా
 • ఉప్పు రుచికి సరిపడా
 • నునె డీప్ ఫ్రై కి సరిపడా
 • సాంబార్ ఉల్లిపాయలు 5
 • అల్లం 2 ఇంచుల ముక్క
 • వెల్లులి 5 రెమ్మలు
 • కార్వేపకు 1 రెమ్మ మసాలా కి 2 రెమ్మలు డీప్ ఫ్రై కి
 • కారం 2 చంచాలు
 • ధనియాల పొడి 1 చెంచా
 • పసుపు 1/2 చెంచా
 • మిరియాల పొడి 1/2 చెంచా
 • జీలకర్ర పొడి 1/2 చెంచా
 • గరం మసాలా 1/2 చెంచా
 • నిమ్మకాయ రసం 2 చెంచాలు
 • నీరు 4 చంచాలు లేదా కవలంటే వేసుకోండి
 • 5 పచ్చి మిర్చి
 • రెడ్ ఫుడ్ కలర్ ఒక పించ్

స్పెషల్ చికెన్ | How to make Special chicken Recipe in Telugu

 1. చికెన్ ని ఒక బౌల్ లో తీసుకొని కత్తితో గాట్లు పెట్టండి
 2. పైన కాస్త ఉప్పు చల్లండి
 3. డబ్బాలో పెట్టి మూతపెట్టి మైక్రోవేవ్లో పెట్టి ఒక్క అయిదు నిమిషాలు చిన్న టెంపరేచర్ మీద ఉడికించండి
 4. ఐదు నిమిషాల తర్వాత మైక్రోవేవ్ లో నుంచి తీసి కాస్త చల్లారనివ్వండి
 5. మిక్సీ జార్ తీసుకొని దానిలో సాంబార్ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి కరివేపాకు కారం ఉప్పు ధనియాలపొడి జీలకర్రపొడి గరంమసాలా మిరియాల పొడి పసుపు నిమ్మరసం కాస్త నీరు పోసి పేస్ట్లా చేసుకోండి
 6. వేసి ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో రెడ్ కలర్ వేసి బాగా కలపండి
 7. దాన్లో గుడ్డు యొక్క తెల్లసొన సగం వేసి బాగా కలపండి
 8. మైక్రోవేవ్ లో ఉడికించిన చికెన్ ముక్కలకు ఈ పేస్టును వేసి మిశ్రమాన్ని బాగా చికెన్కి పట్టించండి
 9. ఒక రెండు గంటలపాటు కదపకుండా పక్కన వుంచండి
 10. కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడ నూనె పెట్టుకుని దాన్ని బాగా కాగాని ఇవ్వండి
 11. చికెన్ వేయిస్తున్నారు అనే ముందు దాంట్లో బ్రెడ్ క్రయంబ్స్ వేసుకుని బాగా కలుపుకోండి
 12. ఇప్పుడు కాగిన నూనెలో చికెన్ ముక్కలు వేసుకొని బాగా బంగారు రంగు వచ్చేదాకా వేయించుకొండి
 13. కరివేపాకు పచ్చిమిరపకాయలను వేడి నూనెలో వేయించుకుని తీయండి
 14. వేయించుకున్న వాటిని చికెన్ పైన చల్లండి
 15. అంతే స్పెషల్ చికెన్ తయారు

Reviews for Special chicken Recipe in Telugu (0)