BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / అరటికాయ ఫ్రిట్టర్స్

Photo of Banana fritters by Tejaswi Yalamanchi at BetterButter
0
1
0(0)
0

అరటికాయ ఫ్రిట్టర్స్

Jun-11-2018
Tejaswi Yalamanchi
15 నిమిషాలు
వండినది?
4 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటికాయ ఫ్రిట్టర్స్ రెసిపీ గురించి

అరటికాయ ఫ్రిట్టెర్స్ కేరళలో చేసుకునే చాలా రుచికరమైన వంటకం. దీనిని నేను మాములు నూనెతో చేశాను మీరు కావాలంటే కొబ్బరినూనెతో కూడా చేసుకోవచ్చు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. అరటికాయ ముక్కలు రౌండ్ గా కోసుకొని వాటిని మైదా మిశ్రమంలో ముంచి నూనెలో వేయించుకుంటాం.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. అరటికాయ 1
  2. మైదా 6 చెంచాలు
  3. పంచదార 4 చెంచాలు
  4. యాలుకల పొడి 1/4 చెంచా
  5. రెడ్ ఫుడ్ రంగు చిటికెడు
  6. సోడా ఉప్పు 1/4 చెంచా
  7. నీరు తగినంత
  8. నూనె వేయించటానికి సరిపడా

సూచనలు

  1. ఒక గిన్నె లో పంచదార తీసుకుని కాస్త నీరు పోసుకోండి
  2. పంచదార కరిగే దాకా కలపండి
  3. ఇప్పుడు దానిలో మైదా పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి
  4. పిండి మిశ్రమాన్ని మరి జారుడుగా కాకుండా కాస్త గట్టిగానే కలుపుకోవాలి
  5. ఇప్పుడు ఇందులో సోడా ఉప్పు, యాలుకల పొడి వేసుకొని కలపండి
  6. కాస్త రెడ్ ఫుడ్ రంగు కూడా వేయండి. అన్నింటిని బాగా కలుపుకొని పక్కన పెట్టండి .
  7. ఆ తర్వాత ఒక అరటికాయ తీసుకొని దానిని చక్రాలుగా గుండ్రంగా తరుక్కోండి .
  8. ఇప్పుడు అరటికాయ చక్రాలను పిండి మిశ్రమంలో వేయండి.
  9. ఒక మూకుడులో వేయించటానికి సరిపడా నూనె పెట్టి వేడి చేసుకోండి.
  10. అరటికాయ ముక్కలకి అన్ని పక్కల పిండి మిశ్రమాన్ని పట్టించి వేడి నూనె లో వేసుకొని దోరగా వేయించండి .
  11. బాగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోండి .
  12. అంతే ఏంతో సులువుగా కేరళ అరటికాయ ఫ్రిటర్స్ తయారు. మీరు చేసుకొని ఆనందించండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర