దాల్ రైస్ చిస్ బాల్స్ | Dhal rice cheese balls Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  11th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Dhal rice cheese balls by Deepika Goud at BetterButter
దాల్ రైస్ చిస్ బాల్స్by Deepika Goud
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

దాల్ రైస్ చిస్ బాల్స్ వంటకం

దాల్ రైస్ చిస్ బాల్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dhal rice cheese balls Recipe in Telugu )

  • అన్నం 1 కప్పు
  • ఉడికించిపెట్టుకున్న కందిపప్పు ‌1కప్పు
  • తురిమి పెట్టుకున్న చిస్
  • తరిగిన అల్లం,వెళ్లి ఉల్లి ముక్కలు 2 చెంచాలు
  • ఆమ్ చుర్ 1/2 టిస్పూన్
  • ధనియాపొడి 1/2టీస్పూన్
  • కారం కొద్దిగా
  • ఉప్పు రుచిని బట్టి
  • పసుపు చిటికెడు
  • ఉల్లిపాయ1
  • క్యారెట్ తురుము 1/2కప్పు
  • టమాటొ 1
  • పచ్చిమిర్చి 3
  • జిలకర్ర1/2 చెంచా
  • కొత్తిమీరు కొద్దిగా
  • పూదిన కొద్దిగా
  • గుడ్డు 1
  • కార్న్ ఫ్లొర్ 1టేబుల్ స్పూన్
  • నూనె వేయించటానికి సరిపడా

దాల్ రైస్ చిస్ బాల్స్ | How to make Dhal rice cheese balls Recipe in Telugu

  1. ముందుగా అన్నం పప్పు ఉడికించి పక్కన పెట్టుకోవాలి లేదా మిగిలిన అన్నం కుడా వాడుకొవచ్చు.
  2. క్యారెట్ మరియు చీజ్ ని తురిమి పెట్టుకొవాలి.
  3. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చి మిర్చీ , టమాటొ , అల్లం వెళ్లిఉల్లి అన్ని సన్నగా కట్ చెసి పెట్టుకొవాలి.
  4. ఇప్పుడు.స్టౌ వెలిగించి గిన్నె పెట్టి నూనె పొయాలి అది వేడి అయ్యాక జిలకర్ర , తరిగి పెట్టిన కూర ముక్కలు ఒక దాని తరువాత ఒకటి వేస్తూ పచ్చి వాసన .పొయె వరకు ప్రై చెయాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు , చిటికెడు పసుపు వేయండి . తరువాత ఉడికించిన పప్పు వేసి కలపాలి తరువాత ఉడికించిన అన్నం కూడా వేసుకొని కలపాలి . ఇప్పుడు దనియాపొడి, ఆమ్ చుర్ పొడి , సరిపడ కారం వేసి కలపాలి. ఆఖరిని కొత్తిమీరు , పూదిన వెసి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి .
  5. ఇప్పుడు స్టవ్త కట్టేసి మగ్గించుకున్న మిశ్రమాన్ని ఒక.ఫ్లెట్ లొకి తిసుకొని 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి .
  6. ఆ లొపు గుడ్డు ని ఒక గిన్నెలొ తిసుకొని బాగా బిట్ చెయాలి. ఇంకొక ఫ్లెట్ లో కార్న్ ఫ్లొర్ వేసి రెడీ గ పెట్టుకోండి .
  7. ఇప్పుడు ఫ్రిజ్ లొ పెట్టిన అన్నo మిశ్రమాన్ని తీసి చిన్న చిన్న ముద్దలు తిసుకొని దాని మద్యలొ చిస్ ముక్కను పెట్టి ఉండలు చుట్టుకొవాలి. ఆ ఉండలని ముందు కార్న్ ఫ్లొర్ లొ దొర్లించి తరువాత ఎగ్ లొ ముంచాలి ఇలా అన్ని చెసుకొవాలి .
  8. తరువాత స్టౌ వేలిగించి కడాయి పెట్టి డిప్రై కి నూనె పొయాలి వేడి అయ్యాక ముందుగా రడి చెసుకున్న ఉండలు వేసి బంగారు రంగు వచ్చె.వరకు ఫ్రై చేసుకొని తరువాత ఫ్లెట్ లొకి తిసుకొవాలి .
  9. రుచితో పాటు పౌష్టికరంగా ఉండే అన్నం పప్పు చీజ్ బాల్స్ రెడీ ..

Reviews for Dhal rice cheese balls Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo