హోమ్ / వంటకాలు / పెసర పునుగులు

Photo of Moong dal pakoda by Sree Sadhu at BetterButter
772
3
0.0(0)
0

పెసర పునుగులు

Jun-11-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
6 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసర పునుగులు రెసిపీ గురించి

పేసర్లతో చేసుకునే ఈ పునుగులు ఎంతో రుచిగా ఉంటాయి.పెసర్లు ఎన్నో పోషకవిలువలు కలిగి ఉండటం వలన ఇవి వంటికి ఎంతో మేలు చేస్తాయి . ఇవి చేసుకోవటం మహా సులువు అతి తక్కువ సామాగ్రి తో తొందరగా తయారు చేసుకోవచ్చును. పిన్న పెద్ద అందరు ఇష్టాంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. పొట్టు పెసర పప్పు - 500 గ్రా
  2. పచ్చి మిర్చి - 50 గ్రా
  3. అల్లం - చిన్న ముక్క
  4. జీలకర్ర - 1 చెంచా
  5. ఉప్పు రుచికి సరిపడా
  6. నూనె వేయించటానికి సరిపడా
  7. ఉల్లిపాయ 1 ముక్కలుగా తరిగినవి
  8. పెరుగు 2 చెంచాలు
  9. టమాట కెచప్ 1 చెంచా
  10. కొత్తిమీర 2 చెంచాలు

సూచనలు

  1. పెసర పప్పుని 3 గంటలు పాటు సరిపడినన్ని నీళ్లు పోసి నానపెట్టి, శుభ్రంగా కడిగి, నీళ్ళు వంచి మెత్తగా రుబ్బుకోవాలి.
  2. అల్లం, మిర్చి రుబ్బి పిండికి జోడించి, ఉప్పు , జీలకర్ర కూడా వేసి రెండు నిమిషాలు రుబ్బుకోవాలి.
  3. రుబ్బుకున్న పిండిని గిన్నిలోకి తీసుకోవాలి.
  4. బాణలిలో నూనె వేడి చేసి, కాగిన తరువాత నిమ్మకాయంత ఉండలు వేసి ఎర్రగా వేయించాలి.
  5. వేయించిన పునుగులను ఒక ప్లేట్లోకి తీసుకొని వాటి మీద చిలికిన పెరుగు ,టమాట కెచప్ ,కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉండే పెసర పునుగులు మీ అందరి కోసం , మీరు చేసుకొని ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర