అరటికాయ చక్రాలు | Raw banana fritters Recipe in Telugu

ద్వారా Deepthimanohar Marri  |  11th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Raw banana fritters recipe in Telugu,అరటికాయ చక్రాలు , Deepthimanohar Marri
అరటికాయ చక్రాలు by Deepthimanohar Marri
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  45

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

1

0

అరటికాయ చక్రాలు వంటకం

అరటికాయ చక్రాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raw banana fritters Recipe in Telugu )

 • అరటికాయలు - 5
 • కారం - 1 చెంచాడు
 • ఉప్పు - తగినంత
 • ధనియాల పొడి - 1 చెంచాడు
 • చాట్ మసాలా 1/2 చెంచాడు

అరటికాయ చక్రాలు | How to make Raw banana fritters Recipe in Telugu

 1. అరటికాయలను రెండు అంగుళం ముక్కలగు తరిగి పెట్టుకోవాలి
 2. అరటి ముక్కల తొక్క తీసేసి, నల్లగా రంగు మారకుండా ఉండడానికి నీళ్ళలో వేసి ఉంచుకోవాలి.
 3. తరువాత పొయ్యి పై కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోసుకొని వేడి చేసుకోండి. అందులో తొక్క తీసి ముక్కలుగా తరిగి పెట్టిన అరటికాయలను వేడి నూనెలో వేసుకొని గోధుమరంగు వచ్చేవరకు 5-7 నిముషాల పాటు వేయించాలి.
 4. ఇప్పుడు, వేయించిన వాటిని ఒకటొకటిగా ప్లేట్ లోకి తీసుకొని చక్రాలుగా ప్రెస్ చేసి మరళ వేడి నూనెలో వేసుకొని దోరగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి దాదాపు మూడు నుండి ఐదు నిమిషాల పాటు.
 5. వేయించిన అరటికాయ చక్రాలని ఒక ప్లేట్ లోకి తీసుకొని రుచికి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి, చాట్ మసాలా చిలకరించి ,సర్వ్ చేసుకోవాలి. అంటే ఎంతో రుచికరమైన అరటికాయ చక్రాలు రెడీ.

నా చిట్కా:

అరటికాయ ముక్కలు నల్లగా కాకుండా ఉండడానికి నీళ్ళలో వేసి ఉంచాలి.

Reviews for Raw banana fritters Recipe in Telugu (0)