దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / అరటికాయ చక్రాలు

Photo of Raw banana fritters  by Deepthimanohar Marri at BetterButter
0
1
0(0)
0

అరటికాయ చక్రాలు

Jun-11-2018
Deepthimanohar Marri
15 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటికాయ చక్రాలు రెసిపీ గురించి

అరటికాయ బజ్జి అనగానే అరటి ముక్కలను సెనేగెపిండిలో ముంచుకొని, వేయించి చేసుకునే సాధారణ వంటకం అనుకునేరు, ఈ అరటికాయ బజ్జిలు చేసుకునే విధానము ఎంతో విభిన్నముగా ఉండటం తో పాటు రుచిలో కూడా ఎంతో మధురంగా ఉంటాయి . ఈ అరటికాయ చక్రాలు చాలా రుచిగా ఉంటాయి. అరటికాయ అంటే అంతగా ఇష్టపడని వారు కూడా దీనిని ఇష్టముగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • తెలంగాణ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. అరటికాయలు - 5
  2. కారం - 1 చెంచాడు
  3. ఉప్పు - తగినంత
  4. ధనియాల పొడి - 1 చెంచాడు
  5. చాట్ మసాలా 1/2 చెంచాడు

సూచనలు

  1. అరటికాయలను రెండు అంగుళం ముక్కలగు తరిగి పెట్టుకోవాలి
  2. అరటి ముక్కల తొక్క తీసేసి, నల్లగా రంగు మారకుండా ఉండడానికి నీళ్ళలో వేసి ఉంచుకోవాలి.
  3. తరువాత పొయ్యి పై కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోసుకొని వేడి చేసుకోండి. అందులో తొక్క తీసి ముక్కలుగా తరిగి పెట్టిన అరటికాయలను వేడి నూనెలో వేసుకొని గోధుమరంగు వచ్చేవరకు 5-7 నిముషాల పాటు వేయించాలి.
  4. ఇప్పుడు, వేయించిన వాటిని ఒకటొకటిగా ప్లేట్ లోకి తీసుకొని చక్రాలుగా ప్రెస్ చేసి మరళ వేడి నూనెలో వేసుకొని దోరగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి దాదాపు మూడు నుండి ఐదు నిమిషాల పాటు.
  5. వేయించిన అరటికాయ చక్రాలని ఒక ప్లేట్ లోకి తీసుకొని రుచికి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి, చాట్ మసాలా చిలకరించి ,సర్వ్ చేసుకోవాలి. అంటే ఎంతో రుచికరమైన అరటికాయ చక్రాలు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర