హోమ్ / వంటకాలు / రాగి లడ్డు

Photo of Ragi ladfu by tanuja indla at BetterButter
924
1
0.0(0)
1

రాగి లడ్డు

Jun-12-2018
tanuja indla
10 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి లడ్డు రెసిపీ గురించి

రాగి పిండి తో చేసుకునే ఈ లడ్డూలు రుచితో పాటు శరీరానికి కావాల్సిన కాల్షియమ్ మరియు పీచు పదార్థాలు అందిస్తాయి .రాగి లో కాల్షియమ్ అత్యధిక మోతాదులో లభిస్తాయి కావున వయసు పైబడ్డ వారికి మరియు ఎదుగుతున్న పిల్లలికి ఇది ఎంతో సహాయపడుతుంది . సీత కలం ఎముకల బలహీనత మరియు నిప్పులు అధికమవుతాయి అటువంటి సమయంలో ఇవి చేసి పెడితే అన్ని పోషక విలువలు అంది ఆరోగ్యం కుదుట పడటానికి సహాయపడుతాయి.

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. రాగి పిండి 1కప్పు
  2. బెల్లం 1కప్పు
  3. నువ్వులు 1/4కప్పు
  4. పలుకులు 1/4 కప్పు
  5. పాలు 1/4 కప్పు

సూచనలు

  1. ఒక పాన్ లో రాగి పిండి వేసుకోంక్ పచ్చి వాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. పిండి వేగితే కమ్మని వాసన వస్తుంది. వేగాక పిండిని పక్కన ఉంచుకోవాలి
  2. అదే పాన్ లో నువ్వులు, పలుకులు వేసి విడిగా వేయించుకోవాలి. చల్లారాక మిక్సీ లో వేసి పొడి చేసుకోవాలి.
  3. బెల్లాన్ని కూడా పొడి చేసుకొని ఉంచుకోవాలి
  4. అన్ని ఒక గిన్నెలో తీసుకొని వేడి పాలు పోసుకొని లడ్డూలుగా చుట్టుకోవాలి
  5. ఆంతే రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే రాగి లడ్డూ రెడీ మీఱు చేసుకొని ఆనందించండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర