హోమ్ / వంటకాలు / రవ్వ బాల్స్

Photo of SUJI Balls by Sandhya Rani Vutukuri at BetterButter
594
1
0.0(0)
0

రవ్వ బాల్స్

Jun-12-2018
Sandhya Rani Vutukuri
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ బాల్స్ రెసిపీ గురించి

రవ్వ బాల్స్ ఎంతో రుచిగా ఉంటాయి పిల్లలు దీనిని ఇష్టంగా తింటారూ. అంతే కాకుండా ఇది చేసుకోవటం మహా సులువు .అత్యంత తేలికగా తయారవుతాయి. ఇందులో ఉపయోగించే సామగ్రి అన్నీ కూడా సులువుగా అందరి ఇంట్లలో దొరికివే కావడం తో ఎప్పుడంటే అప్పుడు తయారు చేసుకోవచ్చును.స్నాక్స్ ల కనిపిస్తూనే కడుపు నింపే ఈ వంటకం యొక్క తయారీ విధానం చూసేద్దామా మరి ?

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. చెక్కెర 1/2 టేబుల్లో స్పూన్
  2. ఎండు కొబ్బరి1/2 టీ స్పూన్
  3. ఎండు కారం 1/4 టీ స్పూన్
  4. ఉప్పు 1/2 టేబుల్లో స్పూన్
  5. సాంబార్ పొడి 1/2 టీ స్పూన్
  6. పోపు దినుసులు చాలా కొద్దిగా
  7. నూనె 2 స్పూన్స్
  8. చిన్న అల్లం ముక్క
  9. 4 మిరియాలు
  10. 2 కప్స్ బొంబాయి రవ్వ
  11. 3 కప్స్ నీ ళ్లు

సూచనలు

  1. ముందుగా 3 చిన్న కప్స్ నీళ్ళు ఒక బాండీ లో పోసి బాగా మరుగు తూ ఉండగా అందులో, చిన్న అంగుళం ముక్క అల్లం తురిమి వేసి, ఒక 5/6 మిరియాలు ఫ్రెష్ గా పొడి చేసి వేసుకొని,కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. యే కొలత తో నీరు పోశారో ఆ కప్పు తో 2 కప్స్ రవ్వని పోసి వెంటనే స్టవ్ బంద్ చేసి ఆ మిశ్రమాన్ని బాగా ఉండలు లేకుండా చేత్తో కలుపు కోవాలి. కరెక్ట్ గా నీరు తిసుకుంటే సరిగ్గా వొస్తుంది.
  2. ఈ మిశ్రమాన్ని 4 నిమిషాలు మూత పెట్టి వొదిలెయ్యండి. 4 నిమిషాలు అయ్యాక,కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి కొంచెం నూనె రాసి, పిండి ని బాగా మెత్తగా అయ్యే దాకా కలిపి, వాటిని (చిన్న గులబ్ జామూన్ కంటే )చిన్న వి ఉండలుగా చేసుకోవాలి.
  3. ఇప్పుడు ఈ ఉండలని ఆవిరికి ఉడికించుకోవాలి. దాని కోసం ఒక పాత్ర లో గ్లాస్ నీరు పోసి స్టవ్ పైన ఉంచి, చిల్లులు ఉన్న పళ్ళెంలో పై న చాలా కొద్దిగా నూనె ను రాసుకోండి.
  4. తయారు చేసుకున్న ఉండలు పెట్టి 10 నిమిషాలు సన్నని సెగ మీద ఆవిరి పట్టాలి ( వాటిని ముట్టుకొని చూస్తే స్పాంజ్ బాల్స్ లాగా మెత్తగా) బాల్స్ గా తయారు అవుతాయి.
  5. ఇప్పుడు తిర్గమూత కు కావాల్సిన పదార్థాలు సిద్ధం చేసుకోండి.
  6. ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక చెంచాడు నేను వేసుకోండి, కాగిన తర్వాత 2 మెంతి గింజలు, చైనా చెంచాడు ఆవాలు, జీలకర్ర, మినపప్పు,ఒక మిరపకాయ, చిటికెడు ఇంగువ, రెండు కరివేపాకు రెమ్మలు, కొంచెం ఎండు కొబ్బరి, 1/2 చెంచాడు సాంబారు పొడి మరియు ఎండు కారం , చిటికెడు చెక్కర వేసి సన్నని సెగ మీద పోపుని వేయించుకోండి.
  7. తయారు చేసిన పోపులో ఉడికించి పెట్టుకున్న రవ్వ ఉండలని వేసి కలుపుకోండి. అంతే ఎంతో రుచికరమైన మరియు పిల్లలకి ఎంతో ప్రీతికరమైన రవ్వ బాల్స్ రెడి. మీరు చేసుకొని ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర