రవ్వ బాల్స్ | SUJI Balls Recipe in Telugu

ద్వారా Sandhya Rani Vutukuri  |  12th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • SUJI Balls recipe in Telugu,రవ్వ బాల్స్, Sandhya Rani Vutukuri
రవ్వ బాల్స్by Sandhya Rani Vutukuri
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

About SUJI Balls Recipe in Telugu

రవ్వ బాల్స్ వంటకం

రవ్వ బాల్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make SUJI Balls Recipe in Telugu )

 • చెక్కెర 1/2 టేబుల్లో స్పూన్
 • ఎండు కొబ్బరి1/2 టీ స్పూన్
 • ఎండు కారం 1/4 టీ స్పూన్
 • ఉప్పు 1/2 టేబుల్లో స్పూన్
 • సాంబార్ పొడి 1/2 టీ స్పూన్
 • పోపు దినుసులు చాలా కొద్దిగా
 • నూనె 2 స్పూన్స్
 • చిన్న అల్లం ముక్క
 • 4 మిరియాలు
 • 2 కప్స్ బొంబాయి రవ్వ
 • 3 కప్స్ నీ ళ్లు

రవ్వ బాల్స్ | How to make SUJI Balls Recipe in Telugu

 1. ముందుగా 3 చిన్న కప్స్ నీళ్ళు ఒక బాండీ లో పోసి బాగా మరుగు తూ ఉండగా అందులో, చిన్న అంగుళం ముక్క అల్లం తురిమి వేసి, ఒక 5/6 మిరియాలు ఫ్రెష్ గా పొడి చేసి వేసుకొని,కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. యే కొలత తో నీరు పోశారో ఆ కప్పు తో 2 కప్స్ రవ్వని పోసి వెంటనే స్టవ్ బంద్ చేసి ఆ మిశ్రమాన్ని బాగా ఉండలు లేకుండా చేత్తో కలుపు కోవాలి. కరెక్ట్ గా నీరు తిసుకుంటే సరిగ్గా వొస్తుంది.
 2. ఈ మిశ్రమాన్ని 4 నిమిషాలు మూత పెట్టి వొదిలెయ్యండి. 4 నిమిషాలు అయ్యాక,కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి కొంచెం నూనె రాసి, పిండి ని బాగా మెత్తగా అయ్యే దాకా కలిపి, వాటిని (చిన్న గులబ్ జామూన్ కంటే )చిన్న వి ఉండలుగా చేసుకోవాలి.
 3. ఇప్పుడు ఈ ఉండలని ఆవిరికి ఉడికించుకోవాలి. దాని కోసం ఒక పాత్ర లో గ్లాస్ నీరు పోసి స్టవ్ పైన ఉంచి, చిల్లులు ఉన్న పళ్ళెంలో పై న చాలా కొద్దిగా నూనె ను రాసుకోండి.
 4. తయారు చేసుకున్న ఉండలు పెట్టి 10 నిమిషాలు సన్నని సెగ మీద ఆవిరి పట్టాలి ( వాటిని ముట్టుకొని చూస్తే స్పాంజ్ బాల్స్ లాగా మెత్తగా) బాల్స్ గా తయారు అవుతాయి.
 5. ఇప్పుడు తిర్గమూత కు కావాల్సిన పదార్థాలు సిద్ధం చేసుకోండి.
 6. ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక చెంచాడు నేను వేసుకోండి, కాగిన తర్వాత 2 మెంతి గింజలు, చైనా చెంచాడు ఆవాలు, జీలకర్ర, మినపప్పు,ఒక మిరపకాయ, చిటికెడు ఇంగువ, రెండు కరివేపాకు రెమ్మలు, కొంచెం ఎండు కొబ్బరి, 1/2 చెంచాడు సాంబారు పొడి మరియు ఎండు కారం , చిటికెడు చెక్కర వేసి సన్నని సెగ మీద పోపుని వేయించుకోండి.
 7. తయారు చేసిన పోపులో ఉడికించి పెట్టుకున్న రవ్వ ఉండలని వేసి కలుపుకోండి. అంతే ఎంతో రుచికరమైన మరియు పిల్లలకి ఎంతో ప్రీతికరమైన రవ్వ బాల్స్ రెడి. మీరు చేసుకొని ఆనందించండి.

నా చిట్కా:

కూరల్లో ఉప్పు ఎక్కువ అయితే, కొంచెం నీరు పోసి, boil అవుతూ ఉండగా గోధుమ పిండి రొట్టె ముద్దలను బిళ్ళ లు గా చేసి వోదలలి.

Reviews for SUJI Balls Recipe in Telugu (0)