హోమ్ / వంటకాలు / ముల్లంగి సొరకాయ రసం

Photo of RADISH BOTTLE GUARD RASAM by Ram Ram at BetterButter
453
2
0.0(0)
0

ముల్లంగి సొరకాయ రసం

Jun-18-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముల్లంగి సొరకాయ రసం రెసిపీ గురించి

ముల్లంగి సొరకాయ తో చేసుకునే ఈ రసం ఎంతో రుచిగా ఉంటుంది. విడిగా ముల్లంగిని అంత ఇష్టంగా తినలేరు కానీ ఇలా చేసుకుంటే పిన్న పెద్ద ఇష్టాంగా భుజిస్తారు. ముల్లంగి మరియు సొరకాయ నీటి ప్రాధాన్యత కలిగిన కూరలు కావడం తో ఖనిజలవణాలు కలిగి ఉంటాయి ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి . ఈ విధంగా రెండు కలిపి మీరు రసం పెట్టి చూడండి, మల్లి మల్లి చేసుకోక ఉండలేరు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ముల్లంగి ముక్కలు 1/2 కప్పు
  2. సొరకాయ ముక్కలు 1/2కప్పు
  3. టమాటో ముక్కలు 1/4కప్పు
  4. కంది పప్పు 1/2కప్పు
  5. పసుపు 1/2స్పూన్
  6. పచ్చిమిర్చి 5
  7. ఆవాలు
  8. జీలకర్ర
  9. కరివేపాకు కొద్దిగా
  10. వెల్లులి 6రెబ్బలు
  11. ఉప్పు సరిపడా
  12. నూనె 5 స్పూన్లు
  13. రసం పొడి 2స్పూన్లు
  14. బెల్లం చిన్న ముక్క
  15. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా కంది పప్పుని కడిగి కుక్కర్లో వేసి, 1స్పూన్ నూనె , పచ్చిమిర్చి కూడా వేసి సరిపడా నీరు పోసి ఉడికించుకోండి.
  2. ఉడికిన తర్వాత పప్పుని బాగా మెదిపి, సొరకాయ , ముల్లంగి ముక్కలు వేసి చింతపండు రసం పిండి టమాటో ముక్కలు వేసి. సరిపడా నీరు వేసి .ఉప్పు పసుపు వేసుకుని ముక్కలు ఉడికెంత వరకు మరగనివ్వాలి.
  3. ఇప్పుడు బాండీ పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లులి కరివేపాకు వేసి వేయించి మరుగుతున్న రసంలో వేసుకోవాలి. ఇప్పుడు 2స్పూన్ల రసం పొడి వేసి బెల్లం వేసుకునే ఇంకొద్ది సేపు మరిగించి కొత్తిమీర వేసి దించుకోవాలి...
  4. రుచికరమైన ముల్లంగి సొరకాయ రసం తాయార్ . మీరు చేసుకొని ఆనందించండి .
  5. రుచికరమైన ముల్లంగి సొరకాయ రసం తాయార్ . మీరు చేసుకొని ఆనందించండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర