హోమ్ / వంటకాలు / మామిడికాయ పులిహోర

Photo of Mango pulihora by Sree Sadhu at BetterButter
492
2
0.0(0)
0

మామిడికాయ పులిహోర

Jun-19-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
19 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ పులిహోర రెసిపీ గురించి

ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని రుచికరమైన వంటకం మామిడికాయ పులిహోర. కొత్త మామిడికాయలు మార్కెట్లో రాగానే వెంటనే పులిహోర చేసుకుంటారు. పుల్లటి మామిడికాయ ఆలా నోటికి తగలగానే ఆహా అంటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం ; ఒక కేజీ
  2. మినపపప్పు ; 3 టేబుల్ స్పూన్స్
  3. పల్లీలు : 2 టేబుల్ స్పూన్స్
  4. ఉప్పు : 4 టీ స్పూన్స్
  5. సెనగపప్పు : 4 టేబుల్ స్పూన్స్
  6. అల్లం : 2అంగుళాల ముక్క
  7. కరివేపాకు : 2 కట్టలు
  8. ఎండుమిరపకాయలు : 15
  9. పచ్చిమిరపకాయలు : 20
  10. ఆవాలు : 2 టీ స్పూన్స్
  11. మామిడికాయలు : 3
  12. పసుపు : 2 టీ స్పూన్స్
  13. ఇంగువ : 1 టేబుల్ స్పూన్
  14. నూనె : 3 గరిటెలు

సూచనలు

  1. ముందుగ బియ్యం కడిగి ఉడికించి ఒక పెద్ద బేసిన్లో ఉండలుగా ఉండకుండా పొడిపొడిగా ఉండేట్టుగా అన్నం ఆరబెట్టాలి.
  2. తరువాత ఒక బాండి తీసుకుని 3 గరిటెల నునే పోసి అందులోనే మినపపప్పు ,సెనగపప్పు,ఆవాలు,ఇంగువ ,ఎండుమిరప ముక్కలు, పసుపు వేసి దోరగా వేయించాలి . అల్లం ముక్కని మెత్తగా గ్రైండ్ చెయ్యాలి .
  3. మామిడి కాయల పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా తరిగి , రుబ్బి పెట్టుకోవాలి.
  4. దోరగా వేగిన పోపులో పచ్చి మిరప ముక్కలు ,అల్లం,కరివేపాకు ,ఉప్పు వేసి ఒక నిముషం తరువాత గ్రైండ్ చేసిన మామిడికాయ గుజ్జుని వేసి ఐదు నిమిషాలు వేగాక చల్లార్చిన అన్నం లో వేసుకొని కలుపుకోండి.
  5. అంతే ఘుమగుమ లాడే వేడి వేడి మామిడికాయ పులిహోర రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర