BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పైనాపిల్ పప్పుచారు

Photo of Pinaple -dal soup by Sri Tallapragada Sri Devi at BetterButter
0
1
0(0)
0

పైనాపిల్ పప్పుచారు

Jun-19-2018
Sri Tallapragada Sri Devi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పైనాపిల్ పప్పుచారు రెసిపీ గురించి

పైనాపిల్ పప్పుచారు వినటానికి కొత్తగా ఉంది కదూ రుచిలో కూడా కొత్త గా ఉంటుంది. పినెవ్ల్ యొక్క వినూత్న ఛాయ తో ఆహ ఏమి రుచి అనే ల ఉంటుంది. దీనిని చేసుకోవటం కూడా మహా సులువు అతి తక్కువ సమయలో అతి తక్కువ సామగ్రి తో చేసుకోవచ్చు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పైనాపిల్ చక్రాలు 4
  2. పండిన టమాటాలు నాలుగు
  3. చిన్న కప్పు కంది పప్పు
  4. 1 చెంచాడు : ధనియాలు జీలకర్ర మిరియాలు వేయించి పొడి చేసినవి
  5. 2 చెంచాలు : కొత్తిమీర తరిగినది
  6. 1 రెమ్మ : కరివేపాకు
  7. 4 : పచ్చిమిర్చి చీలికలు
  8. 2 కప్పులు : నీళ్లు
  9. ఉప్పు రుచికి సరిపడ
  10. 1 చెంచాడు : నూనె
  11. 1/2 చెంచా : ఆవాలు
  12. 1/2 చెంచా : జీలకర్ర
  13. 2 : ఎండు మిరపకాయలు

సూచనలు

  1. టమాటాలు , రెండు పైనాపిల్ చక్రాలు ముక్కలుగా చేసుకోవాలి
  2. కందిపప్పు ని సరిపడా నీళ్లు పోసుకొని కుక్కర్లో ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి
  3. ఉడికిన కందిపప్పును , పైనాపిల్ ముక్కలు, టమాటాలను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  4. మిగిలిన రెండుపైనాపిల్ ముక్కలు టమాటాలను సన్నగా తరిగి , కొత్తిమీర , కరివేపాకు , పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా తరుక్కోవాలి .
  5. రుబ్బుకున్న పైనాపిల్, టమాట , పప్పు ఉప్పు తో పాటు ఈ ముక్కలు కూడా కలిపి రెండు గ్లాసుల నీరు పోసి మరిగించాలి. మరుగుతున్న పప్పుచారు కు ధనియాలు జీలకర్ర మిరియాలు వేయించి పొడి చేసిన పౌడర్ వేసి కలపాలి.
  6. పైనాపిల్ ముక్కలు వేసిన టమాటాలు ఉడికి మరిగాక మూకుడులో చెంచాడు నూనె వేసి అందులో ఆవాలు , జీలకర్ర , పసుపు , ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి మరుగుతున్న పప్పుచారు లో వేసుకొని కలపాలి. గుమగుమలాడే పైనాపిల్ పప్పుచారు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర