కాలి ఫ్లవర్ టమాటా కర్రీ | Cauli flower tomato curry Recipe in Telugu

ద్వారా Swetha Velapaka  |  19th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Cauli flower tomato curry recipe in Telugu,కాలి ఫ్లవర్ టమాటా కర్రీ, Swetha Velapaka
కాలి ఫ్లవర్ టమాటా కర్రీby Swetha Velapaka
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

4

0

కాలి ఫ్లవర్ టమాటా కర్రీ వంటకం

కాలి ఫ్లవర్ టమాటా కర్రీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cauli flower tomato curry Recipe in Telugu )

 • 4 చెంచాలు నూనె
 • 1/2 చెంచాడు ఆవాలు జిలకర
 • 1 టేబుల్ స్ప్పోన్ అల్లం వెల్లులి పేస్ట్
 • 2 టేబుల్ స్పూన్ కారం
 • 1/4 చెంచా పసుపు
 • ఉప్పు రుచికి తగినంత
 • 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి
 • 1/2 కిలో కాలి ఫ్లవర్
 • 3 పచ్చి మిర్చి
 • 1 ఉల్లి గడ్డ
 • కొత్తిమీర ఒక చిన్న కట్ట
 • 2 రెమ్మల కరివేపాకు

కాలి ఫ్లవర్ టమాటా కర్రీ | How to make Cauli flower tomato curry Recipe in Telugu

 1. ముందుగా కాలి ఫ్లవర్, టమాటా, ఉల్లిగడ్డ ,మిర్చి, కొత్తిమీర తరిగి పెట్టుకొవాలి.
 2. పాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్ప్పోన్ల నూనె వేసి వేడి అయ్యాక పోపు దినుసులు వేసి వేగనివ్వాలి.
 3. అందులో తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ,పచ్చి మిర్చి ,కర్వేపాకు ,పసుపు వేసి వేగనివ్వాలి .
 4. పోపు వేగిన తరువాత తరిగిన క్యాలివిఫ్లవర్ ముక్కలు ,టమాటా ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి .
 5. కాలిఫ్లవర్ మగ్గిన తరువాత 2 స్పూన్స్ కారం , రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి .
 6. కూరలు కాస్త ఫ్రై అయ్యాక అందులో ధనియపొడి ,తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి . అంతే ఎంతో రుచిగా ఉండే కాలి ఫ్లవర్ టమాటా కర్రీ రెడీ .

Reviews for Cauli flower tomato curry Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo