సున్నుండలు | SUNNUNDALU Recipe in Telugu

ద్వారా Sarma Sarma  |  19th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • SUNNUNDALU recipe in Telugu,సున్నుండలు, Sarma Sarma
సున్నుండలుby Sarma Sarma
 • తయారీకి సమయం

  45

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

0

0

సున్నుండలు వంటకం

సున్నుండలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make SUNNUNDALU Recipe in Telugu )

 • చక్కెర 500 grams
 • మినపప్పు౼500 grams
 • నెయ్యి౼250gram స్
 • జీడి పప్పు 200గ్రామ్స్
 • బాదం పప్పు 200grams
 • యాలకులు పొడి౼5 గ్రామ్స్
 • జాజికాయ పొడి౼ జస్ట్ స్మాల్ పించ్

సున్నుండలు | How to make SUNNUNDALU Recipe in Telugu

 1. ముందుగా మినప్పప్పు ను బాగా వేయించుకోవాలి...కమ్మటి వాసన వస్తుంది..మరీ మాడిపోయేలా కాదు..తర్వాత కాస్త చల్లారాక మిక్స్ లో వేసుకుని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి
 2. ఇపుడు డ్రై ఫ్రూట్స్ అన్ని నెయ్యి కొద్దిగా వేసుకుని వేయించుకోవాలి..కాస్త చిన్న పలుకులుగా తరిగి పక్కన ఉంచుకోవాలి
 3. ఇపుడు చక్కెర ను మిక్సీ జార్ లో వేసి బాగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి
 4. ఇపుడు మినప్పప్పు పొడి లోకి ఈ చక్కెర పొడి ని. డ్రై ఫ్రూట్స్ ని వేసుకుని కొద్ది కొద్దిగా నెయ్యి కలుపుకుంటూ లడ్డూలు లాగా చేసుకోవాలి అంతే నంది రుచికరమైన బలవర్ధకమైన మంచి సున్నుండలు తయారు

నా చిట్కా:

పదార్థాలు ఏవి కూడా మాడిపోయేలా వేయించకండి..చాలా బాగోదు

Reviews for SUNNUNDALU Recipe in Telugu (0)