హోమ్ / వంటకాలు / బాదం హల్వా

Photo of Almonds Halwa by Suma Malini at BetterButter
590
4
0.0(0)
0

బాదం హల్వా

Jun-19-2018
Suma Malini
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాదం హల్వా రెసిపీ గురించి

బాదం పప్పు గుండె ఆరోగ్యానికి మంచిది.దీనిలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. నా వంటకం లో నెయ్యి ఉపయోగించలేదు. పంచదారకు కూడా ప్రత్యామ్నాయం తేనె, ఖర్జూర పాకం కూడా వాడాను . అందుకని ఇది పూర్తిగా ఆరోగ్య కరమైన బలవర్ధకమైన ఆహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బాదం పప్పు (30 గింజలు లేదా 150గ్రా)
  2. చక్కెర 50గ్ర లేదా తేనె 50మి.లీ లేదా ఖర్జూర పాకం 50 మి.ల్లీ
  3. కుంకుమ పువ్వు చిటికెడు
  4. ఏలకులు పొడి చిటికెడు
  5. పాలు (ఐఛ్ఛికం) 100 మి.ల్లీ

సూచనలు

  1. బాదం పప్పును సరిపడా నీళ్లు పోసి 6 ఘంటల పాటు నాన బెట్టాలి.
  2. నన బెట్టిన బాదాం పప్పులను రుబ్బి పాలు మరియు పిప్పి ని వేరు చేసుకోవాలి.
  3. బాదం పలుకుల్లో సహజంగా ఉండే నూనె వలన వెన్న ముద్దలాగా వస్తుంది. అదికూడా తీసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా పోయకూడదు.
  4. పాలను కుంకుమ పువ్వు తో మరిగించాలి.
  5. ఇప్పుడు బాదం ముద్ద, బాదం పాలు మరిగించిన కుంకుమ పువ్వు పాలతో కలిపి తగిన చక్కెర తో కలిపి ఉడికించాలి.
  6. దగ్గర పడే వరకు ఉడికించాలి.
  7. ముద్దగా అయ్యాక దించాలి.
  8. ఇలాగే బాదం పాలు మరిగించిన తర్వాత కొంత పాలలో తేనె కలిపి ఉడికించాలి.
  9. పంచదార పడని వాళ్ళకు ముందు గా పాలు దగ్గరగా ఉడికించిన తర్వాత తేనె కలిపి 3 నిమిషాలు ఉడికించి దించేయాలి.
  10. మరికొన్ని పాలలో ఖర్జూర పాకం కలిపి ఉడికించాలి. ఆస్థమా ఉన్నవారికి ఖర్జూరం మంచిది‌
  11. దగ్గరగా ఉడికించి దించేయాలి.
  12. ఎంతో ఆరోగ్యకరమైన బాదాం హల్వా రెడీ మీకు నచ్చిన తీపి తో చేసుకొని ఆనందించండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర