వెల్లులి కారం | Red chilli garlic pickle Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  20th Jun 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
  • Red chilli garlic pickle recipe in Telugu,వెల్లులి కారం, Sree Vaishnavi
వెల్లులి కారంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    18

    నిమిషాలు
  • వండటానికి సమయం

    11

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

1

వెల్లులి కారం వంటకం

వెల్లులి కారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Red chilli garlic pickle Recipe in Telugu )

  • వెల్లులి పాయలు 18-20
  • ఎండుమిరపకాయలు 8-10
  • ఉప్పు తగినంత
  • చింతపండు నిమ్మకాయ అంత
  • జీలకర్ర 1 1/2 చెంచా
  • నూనె 2-3 చెంచాలు

వెల్లులి కారం | How to make Red chilli garlic pickle Recipe in Telugu

  1. ముందుగా వెల్లులిపాయల పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి
  2. ఇప్పుడు ఒక ప్లేట్ లో కొంచెం ఉప్పు, జీలకర్ర, చింతపండు సిద్దం చేసుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి నూనె వేసి కాగిన తరువాత అందులో జీలకర్ర ,ఎండుమిరపకాయలు వేసి వేయించాలి
  4. ఇందులో కొంచెం చింతపండు ,వెల్లులి వేసి మరో రెండు నిమిషాలు పాటు వేయించాలి
  5. ఇప్పుడు దానిని కాస్త చల్లార్చుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి
  6. అందులో కొంచెం ఉప్పు, వెల్లులి వేసి బరకగా దంచుకోవాలి
  7. అంతే ఇది బాగా కలిపి వేడి అన్నం లో సర్వ్ చేసుకోవడమే .

Reviews for Red chilli garlic pickle Recipe in Telugu (1)

Revathi Kumari5 months ago

New to here
జవాబు వ్రాయండి