హోమ్ / వంటకాలు / బంగాళదుంప పులిహోర పోపు

Photo of Mashed Potatoes (Andhra Style) by Suma Malini at BetterButter
589
1
0.0(0)
0

బంగాళదుంప పులిహోర పోపు

Jun-20-2018
Suma Malini
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళదుంప పులిహోర పోపు రెసిపీ గురించి

పిన్నా పెద్దా అందరూ ఇష్టంగా తినే కూరల్లో ఒకటి బంగాళాదుంప . బంగాళదుంప పిండి పదార్థాలు కోవకు చెందినది. బంగాళాదుంపలో చెక్జర శాతం ఎక్కువగా ఉండటం వలన చాల సమయం వరకు ఆకలి వేయదు. ఇతర దేశాల్లో చిదిమిన బంగాళాదుంప చేసేటప్పుడు పాలు మరియు చీజ్ వేసి ఉప్పు మిరియాల పొడి తో సీసన్ చేసుకొని తింటారు ఆలా కాకుండా నేను మన ఆంధ్ర స్టైల్ ల్లో ఎలా చేసుకోవచ్చో ఇక్కడ చెబుతాను. బంగాళాదుంప వంటకాన్ని అలాగే తినేయవచును దీనితో మళ్ళీ రోటి లేదా అన్నం అవసరంలేకుండా .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • వేగన్

కావలసినవి సర్వింగ: 3

  1. బంగాళదుంప 2 పెద్దవి.
  2. ఉల్లిపాయ 1 పెద్దది.
  3. అల్లం అంగుళం ముక్క
  4. పచ్చి మిర్చి 1
  5. మినప్పప్పు 1 చెంచా
  6. సెనగపప్పు 1 చెంచా
  7. ఆవాలు 1/2 చెంచా
  8. పసుపు చిటికెడు
  9. కరివేపాకు 6 రేకులు
  10. నువ్వుల నూనె లేదా ఆలీవ్ నూనె 2 చెంచాలు

సూచనలు

  1. బంగాళదుంపలు ఉడికించి ఒలిచి ఉంచుకోవాలి.
  2. బంగాళదుంప ఉడికే లోపు ఉల్లి అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు సిద్దం చేసుకొని ఉంచుకోవాలి.
  3. మూకుడులో నూనె పోపు గింజలు వేసి చిన్న సెగపై దోరగా వేయించాలి. ఆలీవ్ నూనె వాడేటప్పుడు ముందు గా పోపు గింజలు పొడి మూకుడులో వేయించి అప్పుడు నూనె వేయాలి.
  4. ఉల్లి, అల్లం, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి వేయించి, ఉడికించిన బంగాళదుంప లు మెత్తగా చిదిమి కలియపెట్టండి ఎంతో రుచిగా ఉండే ఆంధ్ర స్టైల్ మాష్డ్ బంగాళాదుంప రెడీ. మీరు చేసుకొని తినటమే ఆలస్యం ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర