అటుకులు పులిహోర | Lemon Rice Flakes Recipe in Telugu

ద్వారా Suma Malini  |  20th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Lemon Rice Flakes recipe in Telugu,అటుకులు పులిహోర, Suma Malini
అటుకులు పులిహోరby Suma Malini
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

అటుకులు పులిహోర వంటకం

అటుకులు పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Lemon Rice Flakes Recipe in Telugu )

 • ముడా సోనా మసూరి దంపుడు అటుకులు. 200గ్రా
 • ఆవాలు 1/4 చెంచా
 • మినప్పప్పు 1 చెంచా
 • సెనగపప్పు 1 చెంచా
 • పచ్చి మిర్చి 4
 • ఇంగువ చిటికెడు
 • కరివేపాకు 15 ఆకులు
 • వేరుశనగ పప్పు 20 గింజలు
 • జీడిపప్పు 10 గింజలు (ఐఛ్ఛికం)
 • నిమ్మరసం 50మిల్లి
 • నువ్వుల నూనె 2 చెంచాలు.

అటుకులు పులిహోర | How to make Lemon Rice Flakes Recipe in Telugu

 1. దంపుడు అటుకులు బాగా కడిగి వాడేయండి.
 2. నిమ్మరసం లో తగిన ఉప్పు, పసుపు వేసి కలిపి అటుకులకు కలపండి.
 3. మూకుడులో చెంచాడు నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు కరివేపాకు వేసి సన్నని సెగపై దోరగా వేయించి, పచ్చి మిర్చి, ఇంగువ వేసి వేయించాలి.
 4. నానపెట్టి ఉంచిన అటుకులు వేసి బాగా కలిపి కొంచెం సేపు మగ్గనివ్వాలి.

నా చిట్కా:

దంపుడు దళసరి అటుకులు మాత్రమే నానిన తర్వాత కూడా విడిగా ఉండి పులిహోర కు పనికి వస్తాయి. మిగతా అటుకులు ముద్దగా అయిపోతుంది.

Reviews for Lemon Rice Flakes Recipe in Telugu (0)