హోమ్ / వంటకాలు / వంకాయ ఉల్లికారం కూర

Photo of Brinjal onion curry by Tejaswi Yalamanchi at BetterButter
0
3
0(0)
0

వంకాయ ఉల్లికారం కూర

Jun-20-2018
Tejaswi Yalamanchi
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ ఉల్లికారం కూర రెసిపీ గురించి

వంకాయలంటే మనలో చాలా మందికి ఇష్టం. ఎప్పుడు లాగే బగార వంకాయ, మసాలా వంకాయ లాంటివి కాకుండా ఈ వంకాయ ఉల్లికారం కూడా ఒక సారి చేసి చూడండి. మల్లి మల్లి తప్పకుండ ఇదే చేసుకోవాలని అనిపించక మానదు అంత రుచిగా ఉంటుంది .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఉల్లిపాయలు 4 చిన్నవి
  2. వెల్లుల్లి 10 రెబ్బలు
  3. కారం 4 చెంచాలు
  4. జీలకర్ర 2 చెంచాలు
  5. ఉప్పు తగినంత
  6. వంకాయలు 8
  7. నూనె 4 చెంచాలు
  8. పసుపు 1/4 చెంచా
  9. కార్వేపకు 2 రెమ్మలు
  10. కొత్తిమీర 2 చెంచాలు తరిగినది

సూచనలు

  1. ఉల్లిపాయలని బారు ముక్కలుగా తరిగి పెట్టుకోండి
  2. వంకాయలకి కి కింద భాగంలో నాలుగు భాగాలుగా గాట్లు పెట్టండి
  3. మిక్సీ జార్ తీసుకొని దానిలో ఉల్లిపాయ ముక్కలు ,వెల్లుల్లి రెబ్బలు , కారం,జీలకర్ర వేసి మెత్తగా ముద్దా చేసుకోండి.
  4. ఇప్పుడు ఆ పేస్ట్ లో సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి
  5. ఇప్పుడు చేస్కుకున్న ముద్దని గాట్లు పెట్టిన వంకాయల్లో కూరుకోండి
  6. ఇప్పుడు పోయి మీద పాన్ పెట్టి నూనె వేసుకొండి
  7. నూనె కాగాక దానిలో స్టఫ్ చేసుకున్న వంకాయ ముక్కలు వేయండి.
  8. వంకటల్లో నింపగా మిగిలిన పేస్ట్ ని కూడా పాన్లో వేసుకోండి
  9. జాగర్తగా సన్నని సెగ మీద మూత పెట్టి వంకాయలు 15 నిమిషాల పాటు మగ్గనివ్వండి
  10. 15 నిమిషాల తరువాత పసుపు ,కార్వేపకు వేసి వంకాయలని మెల్లగా కలుపుకొండి
  11. మళ్ళీ మూత పెట్టి చిన్న మంట పైన ఇంకో 5 నిమిషాలు వేయించండి.
  12. 5 నిమిషాల తరువాత.చివరగా కొత్తిమీర చల్లి కలిపి దించేయండి
  13. అంతే వంకాయ ఉల్లికారం కూర తయారు.మీరు చేసుకొని ఆనందించండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర