BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మజ్జిగ పులుసు

Photo of Maggiga pulusu by Sri Tallapragada Sri Devi at BetterButter
0
1
0(0)
0

మజ్జిగ పులుసు

Jun-21-2018
Sri Tallapragada Sri Devi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మజ్జిగ పులుసు రెసిపీ గురించి

మజ్జిగ పులుసు అతి సాధారంగా చేసుకునే ప్రతి రోజు వంటకం .ఇది చేసుకోవటం మహా సులువు అత్యంత తేలికైన రుచి.పేరు ఎంత పాత గా ఉన్నా రుచిలో ఏదైనా దీని తర్వాతే .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఆనపకాయ ముక్కలు 1/2 కప్పు
  2. బెండ కాయలు 4
  3. టమాట 1
  4. చిన్న అల్లం ముక్క
  5. పచ్చిమిరపకాయలు. 4
  6. కొత్తిమీర కొద్దిగా
  7. కరివేపాకు రెండు రెమ్మలు
  8. ధనియాలు 1 స్పూన్
  9. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్
  10. పచ్చి కొబ్బరి ముక్క 1 చిన్నది
  11. మిరియాలు 4
  12. పసుపు 1/4 చెంచా
  13. ఎండుమిరపకాయలు 2
  14. శెనగపిండి 4 చెంచాలు
  15. పెరుగు 1 పెద్ద కప్పు
  16. నీళ్లు 2 గ్లాసులు
  17. ఉప్పు రుచికి సరిపడ

సూచనలు

  1. ఆనపకాయ, బెండకాయ , టమాటా, పచ్చిమిరపకాయలు తరిగి కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి
  2. తరిగిన ముక్కలు అన్నిటిని కొంచెం ఉప్పు పసుపు వేసి ఈ విధంగా ఉడికించుకోవాలి
  3. ధనియాలు ,మిరియాలు ,జీలకర్ర ,పచ్చికొబ్బరి, ఎండుమిర్చి రుబ్బుకోవాలి. అల్లం పచ్చిమిర్చి కూడా చేర్చుకోవాలి
  4. అల్లం ముక్క, కొబ్బరి ధనియాలు మిరియాలు జీలకర్ర ఒక పచ్చిమిరపకాయ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ కావడం కోసం ఒక చెంచాడుపెరుగుఇందులో వేసుకోవచ్చును
  5. తీసుకున్న పెరుగుకు శనగపిండి కలిపి గ్రైండ్ చేయాలి. ముందు గ్రైండ్ చేసుకున్న ధనియాలు కొబ్బరి మసాలా ను కూడా ఈ పెరుగు కలిపి గ్రైండ్ చేయాలి
  6. మసాలాతో పాటు గ్రైండ్ చేసిన మజ్జిగను ఉడికిన ముక్కలు కలిపి స్టౌ మీద సిమ్ లో ఉంచి రెండు పొంగులు వచ్చేదాక మరిగించాలి
  7. మూకుడులో ఎండుమిర్చి , ఆవాలు , జీలకర్ర , కరివేపాకు ,ఇంగువ ల తో పోపు వేయించాలి
  8. ఈ పోపుని రెండు పొంగులు వచ్చిన తరువాత మజ్జిగ పులుసు లో కలపాలి
  9. అంతే ఎంతో రుచికరమైన అతి ప్రాచీన మజ్జిగ పులుసు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర