హోమ్ / వంటకాలు / పోపు బియ్యం

Photo of Popu biyyam by Sree Sadhu at BetterButter
653
3
0.0(0)
0

పోపు బియ్యం

Jun-21-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పోపు బియ్యం రెసిపీ గురించి

పోపు బియ్యం చేసుకోవటం మహా తేలిక కానీ రుచిలో అమోఘం. ముందు రోజు మిగిలిన అన్నం తో కూడా ఈ వంటకం చేసుకోవచ్చు. మిగిలిన దానికి ఇలా కొత్త రూపం ఇస్తే అందరు వెనకాడకుండా భుజిస్తారు. పోపు అన్నాన్ని కొత్త ఆవకాయ tతో తింటే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం 1/2 కప్
  2. బఠాణి 1/2 కప్
  3. క్యారెట్ 1/2 కప్
  4. ఉల్లిపాయ 1/2 కప్
  5. పచ్చిమిర్చి 2-3
  6. మొక్కజొన్న గింజలు 1/2 కప్
  7. బంగాళదుంప 1/2 కప్
  8. కరివేపాకు 1 రెమ్మ
  9. నూనె 3 చెంచాలు
  10. ఆవాలు 1/2 చెంచా
  11. జీలకర్ర 1/2 చెంచా
  12. మినపప్పు 1/2 చెంచా
  13. సెనగపప్పు 1/2 చెంచా
  14. పసుపు చిటికెడు
  15. నీళ్లు 4 కప్పులు
  16. కంది పప్పు 1/2 కప్

సూచనలు

  1. ముందుగా కూరగాయలను బాగా కడిగి తరుగుకోవాలి
  2. ఇప్పుడు ఒకే గిన్నె లో నూనె వేసి కాచుకోవాలి
  3. నూనె కాగిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర ,మినపప్పు, సెనగపప్పు వేసి వేయించాలి
  4. అందులో ఉల్లిపాయ, పచ్చిమిచ్చి, పసుపు వేసి బాగా వేయించాలి
  5. అందులో తరిగిన అన్ని కూరగాయలు వేసి సరిపడినంత ఉప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి
  6. అందులో నీళ్లు పోసి బాగా మరిగాక అందులో కడిగిన కంది పప్పు, బియ్యం వేసి కాస్త మెత్తగా ఉడికించుకోవాలి
  7. ఎంతో రుచిగా ఉండే పోపు అన్నం రెడీ . చేసుకొని కొత్త ఆవకాయ తినేయండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర