హోమ్ / వంటకాలు / బీట్రూట్ మామిడికాయ పచ్చడి

Photo of Beetroot mango chutney by Ganeprameela  at BetterButter
1001
1
0.0(0)
0

బీట్రూట్ మామిడికాయ పచ్చడి

Jun-21-2018
Ganeprameela
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీట్రూట్ మామిడికాయ పచ్చడి రెసిపీ గురించి

బీట్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తాభి వృద్ధికి ఎంతో సహాయపడుతుంది.బీట్రూట్ సహజాగానే కాస్త తీపి మీద ఉంటుంది అలాంటి బీట్రూట్ ని పుల్లటి మామిడికాయ తో కలిపి చేసుకుంటే కట్టా మీఠా పచ్చడి తయారవుతుంది . ఈ పచ్చడి అన్నం లోకి ఎంతో రుచిగా ఉంటుంది .దీని రంగు కూడా పిల్కాని భలేగా ఆకర్షిస్తుంది .

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బీట్రూట్ 1/4 కిలో
  2. పుల్లని మామిడికాయ 1
  3. నూనె 2 స్పూన్లు
  4. పచ్చి మిరపకాయలు 5-6
  5. మెంతులు 1 స్పూన్
  6. జీలకర్ర 1/2 స్పూన్
  7. ఇంగువ చిటికెడు
  8. వెల్లులి రుబ్బలు 4-6
  9. ఎండు మిరపకాయలు 2
  10. కరివేపాకు 1 రెమ్మ
  11. పోపు దినుసులు 1 స్పూన్

సూచనలు

  1. బీట్ రూట్ తొక్క తీసి ముక్కలుగా తరిగి పెట్టుకోండి.
  2. పొయ్యి మీద పాన్ పెట్టి 1 స్పూన్ నూనె వేసుకొని పచ్చి మిరపకాయలు, బీట్ రూట్ ముక్కలు , మెంతులు, అరా చెంచాడు జీలకర్ర వేసి దోరగా వేపుకోండి.
  3. మామిడికాయ ముక్కలు వేపకుండా పచ్చిగానే వేసి , వేయించిన వాటితో పాటు కలిపి అన్నీ గ్రైండ్ చేసుకోవాలి.
  4. పోపుదినుసులు, ఇంగువ, కర్వేపాకు, పసుపు, వెల్లుల్లి వేసి పోపు చేసుకొని పచ్చడి లో కలిపి సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకుంటే బీట్రూట్ రోటి పచ్చడి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర